Gundeninda GudiGantalu Today Episode September 30th :గత ఎపిసోడ్ లో మనోజ్ కు జాబ్ లో కొత్త కోపన్స్ ఇచ్చారని ఇంట్లో అందరిని నమ్మిస్తాడు. అందరిని షాపింగ్ కు తీసుకెళ్తాడు. మీనా, బాలు సెటైర్లతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇక రోహిణి ఎలాంటి మనుషులు అని చీదరించుకుంటుంది అని భర్తను వెనకేసుకొని వస్తుంది. ఇక రవి, శృతి లు షాపింగ్ మాల్ కలుసుకుంటారు. తమ ప్రేమను గెలిపించుకోవాలని అనుకుంటారు. ఎలాగైనా రవీతో పెళ్లి చేసుకోవాలని శృతి అనుకుంటుంది.. ఇక బాలు రవిని చూసి ఇంట్లో వాళ్ల దగ్గరకు తీసుకొని వెళ్తాడు.. ఇక అందరు చీరలను చూస్తూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తారు. బాలు కు సపోర్ట్ గా మీనా నిలవడంతో ఇక ఎపిసోడ్ మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. శృతి, రవీలు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి బాలు మధ్య గొడవ మొదలవుతుంది. ఇక బాలును మీనా సపోర్ట్ చేస్తూ మా ఆయన కష్టపడి సంపాదించింది నాకు ఇస్తాడు అని అంటుంది. బాలు గాడి పెళ్ళానికి అంత అవసరం లేదు ఖరీదైన చీరలు కట్టుకొని ఇంట్లో ఉంటుందా అని అంటుంది ప్రభావతి. అంతలేదు బాలు గాడి పెళ్ళాం కు ఏం కర్మ పట్టలేదు అంటాడు. ఇక రవి శృతిలు మాట్లాడుకుంటారు. అప్పుడే సంజు శృతి కోసం వెతుకుతూ వస్తాడు. అప్పుడే శృతి చూసి సంజు వస్తున్నాడని చెబుతుంది. ఇక రవి నువ్వు వెళ్ళు దాక్కో నేను చూసుకుంటాను అని అంటాడు. సంజు రాగానే నా పియాన్సీని చూసావా అంటే అవును పైన కనిపించింది. మీరు ఇటు వెళ్ళండి అని పంపిస్తాడు. ఇక శృతి, రవి ఇద్దరు కలిసి వెళ్తారు. ప్రభావతి మౌనికకు డ్రెస్సులు కొనాలని అనుకుంటుంది. రోహిణిని తీసుకొని పైకి వెళ్తారు.
ఇక బాలు రావడం రవి చూస్తాడు.. అతను మా బాలు అన్నయ్య.. అవునా మీ వదిన కూడా ఉంది కదా పలకరించి వస్తాను అంటుంది శృతి.. నువ్వు నా కొంప ముంచేలా ఉన్నావే అని రవి శృతితో అంటాడు. ముందు నువ్వు రా అని బాలు కంట పడకుండా పక్కకు తీసుకెళ్తాడు.. ఇక బాలు మీనా దగ్గరకు వెళ్తాడు.. వాళ్లంతా పైకి వెళ్లారు మౌనికకు డ్రెస్సులు కొనడానికి అంటుంది. ఇంత తక్కువ ఉన్నాయెంటి కొంచెం మంచివి చూపించండి అంటాడు. మీకు మంచి రెట్లు కావాలంటే పైన పట్టు చీరలు కొనడానికి వెళ్తారా అని ప్రభావతి దగ్గరకు వెళ్తారు మీనా, బాలు.. ఇక రవి, శృతిలు ఎవరి కంట పడకుండా దాక్కుంటారు. ఇక సంజు, మౌనిక రావడం చూసి నువ్వు ఎవరో, నేనెవరో అని ఇద్దరు చెరోదిక్కు తిరుగుతారు..
ఇక సంజును శృతి మిస్స్ అయ్యాము అని అడుగుతుంది. మౌనిక రవిని చూసి అడుగుతుంది. మౌనిక రవిని ప్రభావతి దగ్గరకు తీసుకెళ్తాడు. ఇక ప్రభావతి కామాక్షి, రోహిణికి మంచి పట్టు చీరలు చూపించమని అడుగుతుంది. ఇక బాలు, మీనా లు అక్కడకు వచ్చి బాలు కౌంటర్స్ వేస్తాడు. ఇక రవి రావడం బాలు చూసి వీళ్లే గొడవ పడుతున్నారు నువ్వు వచ్చావా అని అంటాడు.. అందరు కలిసి చీరలు చూస్తారు. ఏమ్మా వాళ్లు పదివేలు చీరలు చూస్తే అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువగా ఉండే చీరలు చూపించండి అంటాడు.. పూలు కుట్టుకుంటూ ఉంటుంది అని మీనాను వెనకేసుకొని వస్తాడు. మీనా, రోహిణి ఇద్దరి మధ్య కాసేపు గొడవ పెరుగుతుంది.
మీనా బాలు నాన్నకు పట్టు చీరలు కొనాలనుకుంటున్నారు మీరే చెప్పండి అంటుంది. అప్పుడు సత్యం బాలు ఏం జరుగుతుంది.. మీనాను తక్కువ చేస్తున్నారు నాన్న అంటాడు. ఎక్కడా తగ్గొద్దు రా డబ్బులు కావాలంటే నేను పంపిస్తాను అంటాడు. ఇక అందరు సెలెక్ట్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. అప్పుడే శృతి రవి కోసం చూస్తుంది. సంజు రాగానే అతనితో వెళ్లి పోతుంది. అది చూడటానికి బాలు అలా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాడు.. అది చూసిన బాలు ఏ నల్ల భీమా ఎక్కడికి రా వెళ్తున్నావ్ అని అడుగుతాడు. సంజు, శృతిలు శారీస్ చూస్తారు.. బాలు, ప్రభావతి లు ఇద్దరు శారీస్ విషయంలో గొడవలు పడతారు. ఇక రవి బాలుకు ఏదో చెప్పి తప్పించుకుంటాడు. ఇక రవి, శృతిలు మాట్లాడుకోవడం ప్రభావతి చూస్తుందని వెళ్తారు. కామాక్షికి ఈ విషయం గురించి చెబుతుంది. ఇక ఇద్దరు కలిసి ఆ అమ్మాయి ఎవరో అని వెతకాలనీ అనుకుంటారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో బాలు మీనాలు ట్రయిల్ రూమ్ కు వెళ్తారు. రవి శృతిలు పక్కన ఉన్న రూమ్ లో ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో రవి, శృతిలు దొరికిపోతారేమో చూడాలి..