Sameer Rizvi : ఉత్తర ప్రదేశ్ టీ-20 లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అతడు కాన్పూర్ సూపర్ స్టార్స్ కి సారథ్యం వహిస్తున్నాడు. వరుస విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా కొద్ది రోజుల కిందట గోరఖ్ పూర్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 49 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అలాగే మీరల్ మెవెరిక్స్ పై 48 బంతుల్లో 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియంలో లక్నో ఫాల్కన్స్ పై 9 సిక్సులు, 3 బౌండరీలతో 32 బంతుల్లో 76 పరుగులు చేసి మరో సారి చెలరేగాడు. వరుసగా కాన్పూర్ సూపర్ స్టార్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది.
సమీర్ రిజ్వి కెప్టెన్ ఇన్నింగ్స్..
ఈ టోర్నమెంట్ లో కాన్ఫూర్ సూపర్ స్టార్స్ కెప్టెన్ సమీర్ రిజ్వీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో కూడా తను రెచ్చిపోయాడు. లక్నో ఫాల్కన్స్ పై 32 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో తొలుత లక్నో ఫాల్కన్స్ బ్యాటింగ్ చేసి 162/8 పరుగులు చేసింది. అనంతరం కాన్ఫూర్ సూపర్ స్టార్స్ 15.4 ఓవర్లలోనే 163 పరుగులు చేసింది. కెప్టెన్ రిజ్వీ 9 సిక్స్ లు, 3 ఫోర్లతో దూకుడుగా ఆడటంతో చాలా సులువుగా ఛేజింగ్ చేశారు. దీనికి తోడు లక్నో ఫాల్కన్స్ పేలమైన ఫీల్డింగ్ చేసింది. రిజ్వీ నుంచి అద్భుతమైన క్యాచ్ ను జారవిడిచింది. దీంతో అతను జట్టు విజయానికి తోడ్పాటును అందించాడు. ముఖ్యంగా బ్యాటింగ్ కి దిగిన కెప్టెన్ సమీర్ రిజ్వి తన ఆటను చాలా స్లో గా ప్రారంభించాడు. తొలి 15 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే సాధించాడు.
11 బంతుల్లో 7 సిక్సర్లు..
కానీ ఆ తరువాత లక్నో ఫాల్కన్స్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. దాడి చేయడం ప్రారంభించిన రిజ్వి తరువాత 17 బంతుల్లో 9 సిక్సర్లు బాదాడు. మరో గొప్ప విషయం ఏంటంటే..? చివరి 11 బంతుల్లో 7 సిక్సర్లు, 2 ఫోర్లు బాదడం విశేషం. సమీర్ రిజ్వీ నాటౌట్ గా నిలిచాడు. తన జట్టుకు విజయాన్ని అందించిన తరువాతనే తిరిగి స్టేడియం నుంచి బయటికి వచ్చాడు. ఇక మరోవైపు సమీర్ రిజ్వి గత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిట్స్ తరపున ఆడిన విషయం విధితమే. అయితే ఈ సీజన్ లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. కానీ చివరి మ్యాచ్ లో మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా అజేయమైన హాఫ్ సెంచరీ చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ఉత్తర ప్రదేశ్ టీ-20 లీగ్ లో తాజా ప్రదర్శనలతో రిజ్వి మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ దృష్టిలో పడే ఉంటాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనలతో అతనికి మరిన్నీ ఐపీఎల్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతాడో.. లేక మరే జట్టుకైనా ఆడుతాడో వేచి చూడాలి.