Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, రణవీర్‌కు ఫోన్ చేసి ఇంట్లో వాళ్లంతా షాపింగ్‌కు వెళ్తున్నారని ఆరు ఆత్మ కూడా అక్కడికి రావొచ్చని చంభాను మారు వేషంలో అక్కడికి పంపిస్తే ఆరును బంధించవచ్చని చెప్తుంది. దీంతో రణవీర్ సరే అంటాడు. ఇక మరోవైపు మిస్సమ్మ పిల్లల దగ్గరకు వెళ్లి త్వరగా రెడీ కావాలని షాపింగ్‌కు వెళ్దామని చెప్తుంది. ఇంతలో అంజు వచ్చి మిస్సమ్మ రేపు వినాయక చవితికి మనం షాపింగ్ చేస్తున్నాము కదా..? అలాగే అనాధ శరణాలయంలో ఉన్న పిల్లలకు కూడా కొత్త బట్టలు కొనిద్దామని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఎమోషనల్ అయిపోతుంది. గుడ్ ఐడియా అంటూ ఆనంద్ మెచ్చుకుంటాడు.
చాలా మంచి విషయం చెప్పావు అంజు.. ఇప్పుడే నేను ఆశ్రమానికి ఫోన్ చేస్తాను అంటూ వార్డెన్ సరస్వతికి ఫోన్ చేస్తుంది. ఆశ్రమం పిల్లలకు కొత్త బట్టలు కొనిద్దామనుకుంటున్నాము మీరు వీచిత్ర షాపింగ్‌కు రమ్మని చెప్తుంది. సరే రాజు గారిని తీసుకుని వస్తాము అని చెప్తుంది సరస్వతి మేడం. కాల్ కట్ చేశాక వీళ్ళు ఎంత మంచి మనుషులు రాజు గారు అని చెప్తుంది. ఏమైంది మేడం అని రాజు అడగ్గానే.. పండక్కి పిల్లలు అందరికీ కొత్త బట్టలు కొంటామంటున్నారు అని చెప్పగానే నిజంగా వాళ్లు దేవుళ్లు మేడం అంటాడు రాజు.
పిల్లల మెజర్‌మెంట్స్ తీసుకుని మీరు విచిత్ర షాపింగ్ సెంటర్‌కు వెళ్లండి అని వార్డెన్ మేడం చెప్పగానే.. నేను కాదు మీరే వెళ్లండి భాగీ గారితో మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పండి.. అనగానే.. అక్కడ చిత్ర మనోహరి ఉంటారేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది మేడం. దీంతో మీరు ఇప్పుటికే చాలా ఆలస్యం చేశారు మేడం.. ఈరోజు మీరు నిజం చెప్తే రేపు భాగీ మేడం వాళ్లు నిజమైన పండగ జరుపుకుంటారు అని చెప్పగానే.. అది నిజమే నేనే వెళ్తాను స్కూల్‌లో చెప్పలేకపోయాను. ఈరోజు షాపింగ్ మాల్ లో చెప్తాను అంటుంది.
మరోవైపు చిత్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే మేనేజర్ కుమార్ వచ్చి కింద ఫ్లోర్‌లో స్టాక్ అంతా అయిపోవచ్చింది మేడం అని చెప్తాడు. దీంతో చిత్ర ఆశ్చర్యంగా స్టాక్ అయిపోవడం ఏంటి కుమార్.. అప్పుడేనా..? నిన్నే కదా కొత్త స్టాక్ తెప్పించాము అని అడుగుతుంది. దీంతో స్టాక్ అయిపోయిందంటే సంతోషించక షాక్ అవుతారేంటి మేడం. ఇంట్లో సరుకులు అయిపోతే షాక్ అవ్వాలి.. షాపులో సరుకులు అయిపోతే షాక్ అవ్వడం ఏంటి..? మేడం అంటాడు కుమార్. అంటే ఇంత ఫాస్ట్‌గా సేల్స్ అయిపోయాయా అని నమ్మలేకపోతున్నాను అంటుంది చిత్ర.
అది మీ లక్కు మేడం.. నా హస్తవాసి నేను ఎక్కడ అడుగుపెడితే అక్కడ లాభాల పంట పండుతుందని నేను మీకు ముందే చెప్పాను కదా..? మంచి సెంటర్ లో మాల్ ఉంది. ఎక్స్‌పీరియెన్స్‌డ్ మేనేజర్‌గా నేను ఉన్నాను ఇంకేం కావాలి మేడం జనాలు జాతరలా వచ్చి బట్టలు కొనుక్కుని వెళ్లిపోతున్నారు మేడం. ఓ పక్క బట్టల షెల్ఫులు కాలీ అవుతుంటే మరోపక్క మీ గల్లాపెట్టే నిండిపోతుంది మేడం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నెక్ట్స్ మంతే మీరు మరో బ్రాండి ఓపెన్ చేయడం కాయం మేడం ఒకటి కాదు మేడం సిటిలో ఏ సెంటర్ చూసినా మన మాలే ఉండాలి మేడం. అంతేనా మేడం.. నన్ను అడిగితే దేశంలోని ప్రతి సిటీలో మన మాలే ఉండాలని అంటాను. అతి త్వరలో టెక్స్‌టైల్ ఇండస్త్రీలోనే టాప్‌మోస్ట్ ఉమన్ అవడం కాయం మేడం. సార్‌తో చెప్పి కొత్త స్టాక్ తెప్పించండి. ఇంకో విషయం పండగ షాపింగ్‌కు మీ అక్కగారు బావగారు పిల్లలు వస్తున్నారట అని చెప్పగానే..
వాళ్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది. మన షాపే కదాని వస్తున్నారు మేడం వాళ్లతో పాటు అనాథ పిల్లలకు కూడా బట్టలు కొంటారట అని కుమార్ చెప్తుండగానే.. వినోద్ నిజమా కుమార్ అంటూ వస్తాడు. నిజం సార్ ఇందాకే మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది సార్ అని చెప్పగానే.. అన్నయ్య వాళ్లు బట్టలు కొనడానికి ఫస్ట్ టైం మన షాప్‌కు వస్తున్నారు వాళ్లకు దగ్గరుండి మంచి బట్టలు చూపించు కుమార్ అని చెప్తాడు వినోద్. అలాగే వాళ్లకు బిల్ కూడా వేయి కుమార్ అని చిత్ర చెప్పగానే వినోద్ షాక్ అవుతాడు. బిల్లు ఏంటి చిత్ర ఇది మన షాపు అనగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అన్నింటికీ బిల్లు చేయించు అని మేనేజర్‌కు చెప్తుంది చిత్ర.
తర్వాత అందరూ షాపింగ్‌కు వస్తారు. సరస్వతి మేడం కూడా వస్తుంది. షాపులో చిత్ర, మనోహరి ఉండటం చూసి భయపడుతుంది. అయితే ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్లడం కరెక్టు కాదు. భాగీకి నిజం చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం