Film industry:సెలబ్రిటీలు బహిరంగంగా అప్పుడప్పుడు చేసే పనులు చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటాయి. అంతేకాదు సదరు సెలబ్రిటీలు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోని స్టేజ్ పై ఒక హీరో ఒక నటితో చేసిన అసభ్యకర ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మనం ఎక్కడ ఉన్నామో? ఏం చేస్తున్నామో? ఎలా ప్రవర్తిస్తున్నామో? అనే సామాజిక స్పృహ లేకుండా ఆ హీరో ప్రవర్తించిన తీరు అటు చూసే వారిలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా మరి కొంతమంది నెటిజెన్స్ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేస్తూ తిట్టిపోస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు? స్టేజ్ పై నటితో ఎలా ప్రవర్తించారు? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
స్టేజ్ పై నటిని అసభ్యంగా తాకుతూ..
ప్రముఖ భోజ్పురి సినిమా సూపర్ స్టార్ గా పేరు పొందారు పవన్ సింగ్ (Pawan Singh). ప్రస్తుతం ఈయన వివాదంలో చిక్కుకున్నారు. యూపీ లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో స్టేజ్ పైనే నటితో అసభ్యకరంగా ప్రవర్తించారు. నటి అంజలి మైకులో మాట్లాడుతూ ఉండగా.. ఆమె నడుమును తాకి ఏదో ఆమెతో చెప్పారు. అంజలి అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ కూడా అతడు ఆమెను వదలలేదు. మరొకసారి ఆమె నడుమును తాకుతూ .. ఆమె నడుము మీద ఏదో శుభ్రం చేస్తున్నట్టు కనిపించారు. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడిపోయింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయం లో అంజలి ఏం చేయాలో తెలియక.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక.. అతడు తాకిన ప్రతిసారి నవ్వుతూ కనిపించడంతో ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న సదరు నెటిజన్స్ పవన్ సింగ్ పై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే పవన్ సింగ్ ఆమెకు క్షమాపణలు చెప్పాలి అని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఒక పాటతో భారీ పాపులారిటీ..
ఇదిలా ఉండగా భోజ్పురి సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న పవన్ సింగ్ తన కొత్త పాట “సయ్యాసేవాకరే” పాటతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇతనితో అంజలి రాఘవ్ కలసి డాన్స్ చేసింది. వీరిద్దరి జోడి కి అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇంతలోనే వీరిద్దరికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ సింగ్ పై చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ పాట సాహిత్యం, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఈ పాట ఐదు గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్, 85 వేలకు పైగా లైకులు సొంతం చేసుకుంది. అలా ఈ పాటతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ సింగ్ పై ఇప్పుడు ఇలాంటి ట్రోల్స్ జరగడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.
also read:Tollywood: ఒకప్పుడు మహేష్ తో రొమాన్స్.. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి సీఈవో.. ఎవరో తెలుసా?
?utm_source=ig_web_copy_link