BigTV English

Ambati Son in Law Video : అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు

Ambati Son in Law Video : అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు

Son in law slams Ambati Rambabu : నిన్న ముద్రగడకు, నేడు అంబటికి సొంత కుటుంబ సభ్యుల నుంచే నిరసన సెగ తగిలింది. వైసీపీకి ఓటెయ్యొద్దని, తన సపోర్ట్ పవన్ కల్యాణ్ కే అని ముద్రగడ కూతురు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ సైతం ఇలాంటి స్టేట్మెంట్ తోనే ఒక వీడియో విడుదల చేశారు. దాంతో అంబటికి ఊహించని షాక్ తగిలినట్లైంది. అంబటి రాంబాబు రెండో కూతురి భర్త.. అల్లుడు డాక్టర్ గౌతమ్ సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంబటిపై సొంత అల్లుడే.. వాడో నీచుడు అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.


అంబటి రాంబాబుకు అల్లుడిని అవ్వడం తన దురదృష్టమని, అతనిలాంటి మనిషి మరొకరు ఉండరన్నారు. ఇలాంటి వ్యక్తిని జీవితంలో కలవకూడదని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. మంచితనం, మానవతా విలువలు కాదు కదా.. కనీస బాధ్యతలు కూడా ఆయనకు లేవన్నారు. అంబటి రాంబాబుకు ఓటేస్తే.. రాష్ట్రంలో అభివృద్ధి మరింత కుంటుపడుతుందన్నారు.

Also Read : ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు: చంద్రబాబు


అంబటి రాంబాబంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. ఇలాంటి మరో నీచుడిని జీవితంలో కలకూడదనుకుంటున్నట్లు తెలిపారు. కనీస మానవతా విలువలు 0.1 శాతం కూడా ఆయనలో లేవని విమర్శించారు. ఎంతపెద్ద అబద్ధాన్నైనా నిజం చేసే వ్యక్తి అని, ఎలాంటి లేకిపనైనా చేసి హుందా బ్రతకొచ్చని, ఏం చేసైనా సిగ్గులేనితనాన్ని ప్రోత్సహిస్తారని.. అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని కోరారు.

అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి కాకుండా.. సరైన నాయకుడికి ఓటు వేసి ఎన్నుకోవాలని కోరారు. డాక్టర్ గౌతమ్ విడుదల చేసిన వీడియో.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చర్చకు దారితీసింది. సొంత అల్లుడే పరుష పదజాలంతో ఇలా తిడుతున్నాడంటే.. అతను ఎలాంటి వాడోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా.. అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. కూటమి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×