BigTV English

Allu Arjun : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? వైసీపీ.. టీడీపీ.. బిగ్ బ్రేకింగ్ సీక్రెట్ ఇదేనా ?

Allu Arjun : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? వైసీపీ.. టీడీపీ.. బిగ్ బ్రేకింగ్ సీక్రెట్ ఇదేనా ?

Allu Arjun Big Breaking News : తెలుగుదేశం పార్టీకి పోటీగా రేపు (అక్టోబర్ 24) మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ ఏదో ప్లాన్ చేసింది. ఎందుకంటే, ‘బిగ్ ఎక్స్‌పోజ్ స్టే ట్యూన్డ్’ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వారికి పోటీగా వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో ‘బిగ్ రివీల్’ అనే పోస్టర్‌ను పోస్ట్ చేసింది. సరిగ్గా 24వ తేదీ, 12 గంటలకు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు, ఎవరి కోసం పెడుతున్నాడు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అన్న విషయాల మీద అంతా ఫోకస్ పెట్టారు.


వైసీపీకా లేక టీడీపీకా…

ఒక దశలో వైసీపీకి అనుకూలంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడా అన్న సందేహం ఇటు పార్టీలకు, అటు జనాల్లోకి వెళ్లడం గమనార్హం. ఇక తన మామ, మెగా బ్రదర్ అయిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వానికి అల్లుడు అల్లు అర్జున్ ఝలక్ ఇవ్వబోతున్నాడా ఏంటి అన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోందట.


అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆసక్తికరం…

కాబట్టి వైసీపీ, టీడీపీ ఇలా ఉన్నఫలంగా బ్రేకింగ్స్ అని చెప్పడం, అదే టైమ్‌లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇలా ఒకదాని వెంట మరొకటి అంశాలతో ఆసక్తికర చర్చ ఊపందుకుంది.

మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది…

అల్లు అర్జున్ ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో తన నంద్యాల టూర్ వ్యక్తిగతం అంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిటిషన్ కోర్టురలో విచారణంలో ఉంది. మరోవైపు ‘పుష్ప 2’ త్వరలోనే విడుదల కానుంది. దీంతో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందోనని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్, పొలిటికల్ అనలిస్టులను ఉత్కంఠతకు గురిచేస్తోంది.

వైసీపీ బిగ్ రివీల్ ఎందుకు…

అయితే, మొదట బిగ్ బ్రేకింగ్ అంటూ తెలుగు దేశం పార్టీ పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీడీపీలో చేరుతున్నారా అని కొందరు అనుకుంటున్నారు. ఇంతలోనే కాదు కాదు, వైసీపీ కూడా బిగ్ రివీల్ అని పెట్టింది కాబట్టి ఆ పార్టీలోనే చేరుతున్నాడు కాబోలు అని మరికొందరు అంటున్నారు. ఇంతకు ఏం జరుగుతుందో తెలియాలంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగాల్సిందే మరి.

అయితే, అల్లు అర్జున్ అక్టోబర్ 24న ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసిన తర్వాతే టీడీపీ ఈ పోస్టర్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ కూడా అలా కౌంటర్ ఇచ్చి ఉండవచ్చని జనాలు అనుకుంటున్నారు. మరి, బన్నీ ఏం బాంబు పేల్చబోతున్నాడో చూడాలి. ప్రస్తుతం వైసీపీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారికి ఒక ‘బిగ్’ హ్యాండ్ అవసరం. అది బన్నీయే కాబోతున్నాడా అనేది సందేహం. అయితే, బన్నీ రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అనేది కొందరు అభిమానుల అభిప్రాయం. రేపు పెట్టబోయే ప్రెస్ మీట్‌లో బన్నీ.. తనని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Also Read : హైకమాండ్ ఆదేశాలతోనే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం, కానీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు మాది భరోసా, టిపీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×