BigTV English

Bigg Boss 8 Telugu Promo: గంగవ్వకు ఏమైంది.? అర్థరాత్రి హాల్‌లో ఒంటరిగా కూర్చొని అరుపులు, ఏడుపులు

Bigg Boss 8 Telugu Promo: గంగవ్వకు ఏమైంది.? అర్థరాత్రి హాల్‌లో ఒంటరిగా కూర్చొని అరుపులు, ఏడుపులు

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాతే కాస్త ఎంటర్‌టైన్మెంట్ పెరిగింది అని కొందరు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. బిగ్ బాస్‌ను చూసే ఆడియన్స్‌ను బోర్ కొట్టించుకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫన్ టాస్కులు ప్లాన్ చేస్తున్నారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. అలా ఫన్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా బిగ్ బాస్ సాగిపోతున్న సమయంలోనే గంగవ్వకు ఏదో అయ్యింది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా హాల్‌లోకి వచ్చిన గంగవ్వ.. అరుస్తూ ఏడుస్తూ అందరినీ విపరీతంగా భయపెట్టింది. తన ఎఫెక్ట్‌తో కంటెస్టెంట్స్ అంతా ఒణికిపోయారు.


అసలేం జరిగింది?

గంగవ్వ జుట్టు విరబోసుకొని హాల్‌లోని టేబుల్‌పై కూర్చొని వింత శబ్దాలు చేయడంతో బిగ్ బాస్ ప్రోమో ప్రారంభమయ్యింది. ఆ సౌండ్స్‌కు కంటెస్టెంట్స్ లేచారు. ముందుగా హాల్‌లోకి వచ్చి చూసిన తర్వాత తన దగ్గరకు వెళ్లడానికి కూడా అందరూ భయపడ్డారు. అందరూ వచ్చి తనకు నీళ్లు తాగించడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. నయని పావని భయపడి స్టోర్ రూమ్ కెమెరాతో మాట్లాడడానికి ప్రయత్నించింది. అబ్బాయిలంతా ధైర్యంగా తనను కంట్రోల్ చేయాలని చూశారు. కానీ అమ్మాయిలు మాత్రం భయపడి దూరంగానే నిలబడ్డారు. టేస్టీ తేజ తనను కష్టపడి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాడు. తన పక్కనే కూర్చున్నారు.


Also Read: నోరు జారిన విష్ణు ప్రియ.. చరిత్ర సృష్టించబోతున్న ప్రేరణ..!

వణికిపోయారు

అదంతా చూసి భయపడిన హరితేజ.. ‘‘ఎలా పడుకోవాలి? నాకు కాళ్లు, చేతులు వణుకుతున్నాయి’’ అని ఇతర అమ్మాయిలతో చెప్పింది. నాకు కూడా అంతే అని రోహిణి చెప్పింది. తర్వాత వీరిద్దరి మధ్య గంగవ్వ గురించి డిస్కషన్ జరిగింది. ‘‘కళ్లు కూడా తెరవలేదు’’ అని రోహిణి అనగానే అవును అని హరితేజ ఒప్పుకుంది. ‘‘నిద్రలో నడవడం అంటే ఇదేనా?’’ అని హరితేజకు డౌట్ వచ్చింది. రోహిణి అయితే ఇది కావాలని చేసింది కాదని, తెలియకుండా ఎవరో తన లోపలికి వచ్చినట్టు ప్రవర్తించింది అని నమ్మకంగా చెప్పింది. టేస్టీ తేజ, అవినాష్ కూడా అందరూ భయపడిపోయారని మాట్లాడుకున్నారు. కానీ ఇదంతా ప్రాంక్ అని ప్రోమో చివర్లోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

గంగవ్వ ప్రాక్టీస్

టేస్టీ తేజ, అవినాష్ కలిసి గంగవ్వతో ఒక ప్రాంక్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. ‘‘నేను, గంగవ్వ, అవినాష్ కలిసి ఇంటి సభ్యులపై ఒక ఘోస్ట్ ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాం. ఇది మా ముగ్గురికి మాత్రమే తెలుసు’’ అంటూ బిగ్ బాస్‌కు క్లారిటీ ఇచ్చాడు తేజ. తర్వాత గంగవ్వ దగ్గరకు వెళ్లి ఈ ప్రాంక్ చేయడానికి ఒప్పించారు. బిగ్ బాస్‌తో ముందే ఒక మాట చెప్పేశామని టేస్టీ తేజ చెప్పగానే గంగవ్వ ఇది చేయడానికి ఒప్పుకుంది. ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసింది. అస్సలు నవ్వొద్దు అని హెచ్చరించారు. అలా వీరు ముగ్గురు కలిసి చేసిన ఘోస్ట్ ప్రాంక్.. బిగ్ బాస్ హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్స్‌ను ఒక రేంజ్‌లో భయటపెట్టింది. ప్రోమో మొదలవ్వగానే ఆడియన్స్ కూడా గంగవ్వను చూసి భయపడ్డారు.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×