E-Paper
Advertisement

సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్

సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్
Advertisement

Srikakulam Politics: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఉత్తరాంధ్రలో మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపింది. రేపో మాపో వైసీపీ తీర్థం పుచ్చుకోనుంది. దీనివెనుక ధర్మాన ప్రసాదరావు కీలక రోల్ పోషించినట్టు వార్తలు వస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు.. సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్

స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీలో క్రమంగా చిచ్చు రేపుతున్నాయి. ఫలితంగా టికెట్లు రాని నేతలు, ఆశావహులు తమ దారి చూసుకుంటున్నారు. శ్రీకాకుళం మేయర్ టికెట్ కోసం పోటీ పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి, చివరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తూ కన్నిటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన ఆమె, కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రామారావు ఆధర్వంలో 1985లో నా భర్త టీడీపీలో చేరారని వివరించారు.

టీడీపీతో నాలుగు దశాబ్దాల బంధాన్ని తెచ్చుకున్న లక్ష్మిదేవి

Advertisement

నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీతో ఉన్న బంధం తెచ్చుకుంది లక్ష్మి ఫ్యామిలీ. ఆమె భర్త శ్రీకాకుళం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, రెండు సార్లు మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం టౌన్ గురించి ఆమె గెలుపొందారు.  గడిచిన దశాబ్దంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు. పార్టీలో కొందరు తనను, మద్దతుదారులను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.

నా భర్త విగ్రహం కోసం పెట్టిన దిమ్మెలను కొట్టేశారని కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రజల కోసం జీవితాన్ని దారపోయిన నాయకుడు విగ్రహాన్ని నగరంలో పెట్టకుండా చేయడం అత్యంత బాధాకరమన్నారు. 40 ఏళ్లుగా జండా మోసిన మాకు పార్టీ‌లో ఎలాంటి ప్రాధాన్యం లేదని మనసులోని బాధ బయటపెట్టారు. పార్టీ కోసం మా కుటుంబం త్యాగం చేసిందన్నారు. ఫలితంగా సొంత ఇంట్లో ఒంటరితనం, అవమానాలు ఎదురుకావడం కలిచి వేసిందన్నారు.

Advertisement

ALSO READ: కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?

తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే. మరోవైపు గురు-శుక్రవారాల్లో లక్ష్మిదేవి, వైసీపీ అధినేత జగన్ సమక్షంలో చేరుతున్నట్లు సమాచారం. లక్ష్మిదేవి టీడీపీకి రాజీనామా ధర్మాన వ్యూహం ఫలించింది. మేయర్ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదని గమనించిన ధర్మాన, ఆమెతో మంతనాలు జరిపారు. తమ పార్టీ తరపున పోటీ చేయాలని, ఎన్నికల్లో గెలిచేందుకు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చినట్టు దిగువ స్థాయి కేడర్ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మిదేవి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.

Related News

విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక

కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?

వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

Big Stories

Advertisement
×