Payal Raj Puth: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా వాళ్లు మాట్లాడే మాటలను మొదలుకొని ధరించే దుస్తుల వరకు ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులు వేయాలంటే కష్టం. అందుకే సెలబ్రిటీలు తమకు నచ్చిన విధంగా మాట్లాడుతూ.. తమకు నచ్చిన దుస్తులను ధరిస్తూ తమ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు.
కానీ కొంతమంది గిట్టని వారు వారు ఏం మాట్లాడినా లేదా వారు ధరించిన దుస్తుల్లో ఏదైనా కాస్త తేడా ఉన్నా.. వెంటనే విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు శరీరంలో ఏదైనా కాలంతో పాటు మార్పులు వచ్చినా సరే బాడీ షేమింగ్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే..అయితే అందులో కొంతమంది ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే మరి కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ తనపై బాడీ షేమింగ్ ట్రోల్స్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అసలు నన్ను అనే హక్కు మీకు ఎవరిచ్చారు? అనే రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్. తాజాగా పాయల్ రాజ్ పుత్ పేరుతో ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “అసలు మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్ చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుండాలి. నా శరీరం, నా గర్వం.. ఇది మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కాదు. మీ పరిధిలో మీరు ఉండండి. మీ పని మీరు చూసుకోండి”అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి అయితే పాయల్ రాజ్ పుత్ పై వచ్చిన బాడీ షేమింగ్ ట్రోల్స్ కి ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చింది.
also read:వంశీకి నిజంగానే బ్రెయిన్ లేదా.. రెచ్చగొట్టిన ముఖేష్!
పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే.. 2018 లో అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ అంతకంటే ముందే 2017లో విడుదలైన పంజాబీ చిత్రం చెన్నా మేరేయా అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది . RX 100 సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమెకు ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన ఆదరణ కూడా లభించింది. పైగా ఈ సినిమాతో మంచి క్రేజ్ ఏర్పడింది. 2023లో మళ్లీ అదే అజయ్ భూపతి డైరెక్షన్లో మంగళవారం సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం సీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఇకపోతే మరొకవైపు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె తన సినిమా విశేషాలు, ఫోటోలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Shame on you people 👊🏻
Shame on everyone sharing these videos and leaving disgusting comments about my body. My body, my size, and my pride. It’s not up for your debate, your opinions, or your vulgarity.
Stay in your lane and mind your own business. 👆🏼#bodyshaming #shameonyou— paayal rajput (@starlingpayal) October 20, 2026