E-Paper
Advertisement

కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?

కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?
Advertisement

AP local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో అంకం మొదలైంది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు మొదలుకానున్నాయి. ఇంతకీ కూటమి పార్టీల మధ్య స్థానాల విషయం కొలిక్కి వచ్చిందా? ఏపీలోని కార్పొరేషన్లలో వార్డుల పంపకాలు మూడు పార్టీల మధ్య పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఏ పార్టీకి ఎక్కడ ఎక్కువ సీట్లు అనేది ఓ లుక్కేద్దాం.

కూటమి పార్టీల మధ్య కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి

ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలు హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా కూటమిలోని టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య మేయర్, మున్సిపాలిటీలకు  పంపకాలు పూర్తి అయినా, వార్డుల షేరింగ్ ఇంకా కొలిక్కి వచ్చినట్టు లేదు. పలు ప్రాంతాల్లో ఈ మూడు పార్టీలకు చెందిన రెబెల్స్‌గా బరిలోకి దిగారు. దీంతో 100 శాతం స్ట్రైక్ రేటు సాధించాలన్న కూటమి ఆశలపై కార్యకర్తలు నీళ్లు చల్లారు.

Advertisement

ఏపీలోని కీలకంగా మారిన మూడు కార్పొరేషన్ల విషయానికి వద్దాం. అందులో కీలకమైనవి మూడు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లలో కూటమి పార్టీల మధ్య వార్డుల పంపకాలు పూర్తి కావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఒకే వార్డులో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలకు చెందిన ఆశావహులు నామినేషన్లు వేయడంతో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో అభ్యర్థుల విషయంలో రెబల్స్ నుండి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరిగింది.

ఊపిరి పీల్చుకున్న కూటమి కీలక నేతలు

విశాఖ  కార్పొరేషన్‌లో మొత్తం 120 వార్డులకు జనసేనకు 30, బీజేపీకి 10, టీడీపీ-80, జనసేన -30, బీజేపీ-10 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. ఖరారైన వాటికి పార్టీలు ఆయా అభ్యర్థులకు బీ ఫారమ్ ఇచ్చారు. జీవీఎంసీ 120 వార్డుల్లో టీడీపీ నుంచి 504, జనసేన 278, బీజేపీ 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెల్సిందే. కనీసం 34 సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబట్టింది. చివరకు 30 సీట్లు ఇచ్చినట్టు సమాచారం. కార్పొరేటర్ అభ్యర్థులకు సరైన న్యాయం జరగకపోవడంతో భారీగా నామినేషన్లు పడ్డాయి. చాలామంది నేతలు విత్ డ్రాలు చేసుకున్నారు.

Advertisement

ఇక విజయవాడ కార్పొరేషన్ విషయానికి వద్దాం. మొత్తం 86 డివిజన్లు ఉన్నాయి. అందులో టీడీపీ-57, జనసేన -21, బీజేపీ -8 చోట్ల పోటీ చేస్తున్నాయి. 86 డివిజన్లలో ఏకంగా 52 చోట్ల రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నేతలను ఇప్పటికే హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఎంపీలు వారితో మంతనాలు సాగించడంతో పలువురు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఇక జనసేన పార్టీది కూడా అదే వంతు. బీజేపీ నుంచి చాలామంది వెనక్కి తగ్గారు. సీటు ఏ పార్టీకి దక్కినా మిగతా రెండు పార్టీల మద్దతు తప్పనిసరి అయ్యింది. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోని నేతలపై సస్పెన్షన్ వేటు పడనుంది.

ALSO READ: వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు

తిరుపతి కార్పొరేషన్‌లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చింది. తిరుపతి కార్పొరేషన్‌కు 66 వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ-39, జనసేన-22, బీజేపీ-5 డివిజన్లలో పోటీ చేయనుంది. ఎక్స్‌ అఫీషియో ఓ స్థానాన్ని కేటాయించారు. కూటమి నేతలు గడిచిన మూడు నాలుగు రోజులు పలు విడతలుగా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. మిగిలిన వారితో నామినేషన్ల ఉపసంహరణ కోసం మంతనాలు చేశారు.

Related News

వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

Big Stories

Advertisement
×