E-Paper
Advertisement

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు
Advertisement

Tirumala: ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.

 

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఈ ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు, ప్రస్తుతం విచారిస్తున్నారు.

సాయంత్రం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు. సోదాల సమయంలో లోకనాథం ఇంట్లో భారీ ఎత్తున విలువైన ఆస్తులు ఏసీబీకి చిక్కాయి. అందులో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిపై సోదాల వెనుక కల్తీ నెయ్యి కేసులో చిన్న అప్పన్న విచారణలో సేకరించిన ఆధారాలతో లోకనాథంపై కేసు నమోదు చేశారు.

Advertisement

 

డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

లోకనాథం, ఆయన కొడుకు పేరిట నాలుగు ఫిక్స్ డ్ డిపాజిట్లను గుర్తించారు. తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్, గొల్లవానిగుంటలో రెండు ఇల్లు, వడమాలపేట మండలం పాదిరేడులో ఇల్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దాదాపు 24 గంటలపాటు లోకనాథంతోపాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదారు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులున్నట్లు గుర్తించారు.

మొత్తం ఏసీబీ అధికారులు ఏడు బృందాలు విడిపోయి ఐదు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఆయనకు ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. మార్కెట్ విలువ అయితే రూ. 20 కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే కల్తీనెయ్యి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు టీటీడీలో అప్పుడే చర్చ మొదలైంది.

ALSO READ: ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్,

Related News

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×