E-Paper
Advertisement

తెలంగాణలో తొలి రైలు ప్రారంభం ఇక్కడి నుంచే.. ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించిందంటే?

తెలంగాణలో తొలి రైలు ప్రారంభం ఇక్కడి నుంచే.. ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించిందంటే?
Advertisement

Historic Telangana Railway Station: తెలంగాణలో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? ఒకప్పుడు కేవలం 6 కిలో మీటర్ల ప్రయాణంతో మొదలై.. ఇప్పుడు లక్షలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా కనిపిస్తోంది. 150 ఏళ్లకు పైగా చరిత్రను కలిగింది. హైదరాబాద్ సంస్థానంలో రైల్వే ప్రయాణానికి పునాది వేసిన ఈ స్టేషన్ వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఏదంటే..

1874లో ప్రారంభమైన రైల్వే చరిత్ర

తెలుంగాణలో తొలి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీని నిర్మాణం 1874లో పూర్తయింది. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన కొనసాగుతున్న కాలంలో దీనిని నిర్మించారు. హైదరాబాద్ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో రైల్వే మార్గం ద్వారా కలపాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 1870 ప్రాంతంలోనే రైల్వే మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు మొదలయ్యాయి. చివరకు 1874 అక్టోబర్ 8న సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే మార్గం ప్రారంభమైంది. ఈ మార్గం సుమారు 192 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది.

తొలి రైలు ప్రయాణం 6 కిలోమీటర్లే!

Advertisement

ఈ రైల్వే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి రోజున జరిగిన ప్రయాణం వాడి వరకు జరగలేదు. అప్పటి నిజాం,  సాలార్ జంగ్‌ తో పాటు ఇతర ముఖ్య అధికారులు, సుమారు 150 మంది ప్రయాణికులు స్టీమ్ ఇంజన్ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి మిలిటరీ సైడింగ్ వరకు ప్రయాణించారు. ఆ దూరం కేవలం 6 కిలోమీటర్లే. కానీ, ఈ చిన్న ప్రయాణమే హైదరాబాద్ సంస్థాన రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

కోటను తలపించే స్టేషన్ నిర్మాణం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం అప్పటి నిజాం శైలి, మొఘల్ వాస్తు కళల ప్రభావాన్ని ప్రతిబింబించేలా ఉండేది. పాత భవనం బయట నుంచి చూస్తే కోటను తలపించేలా కనిపించేది. నిజాం సొంత నిధులతో నిర్మించిన ఈ స్టేషన్, అప్పటి హైదరాబాద్ సంస్థాన అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. ఆ కాలంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేవి. పర్దా పద్ధతిని అనుసరించే మహిళలు ఇతరులకు కనిపించకుండా రైలు ఎక్కడానికి, దిగడానికి ప్రత్యేకంగా ‘పర్దా వాల్’ ఏర్పాటు చేసినట్లు చెబుతారు.

రైల్వే మార్గం వెనుక బ్రిటీష్ వ్యూహం

Advertisement

సికింద్రాబాద్-వాడి రైల్వే మార్గం ప్రధాన వ్యాపార నగరాల గుండా కాకుండా తాండూర్, వికారాబాద్ లాంటి ప్రాంతాల మీదుగా వెళ్లింది. ఈ మార్గాన్ని బ్రిటీష్ సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు చరిత్ర చెబుతోంది. సైన్యాన్ని వేగంగా తరలించడానికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

హైదరాబాద్ సంస్థానంలో రైల్వే వ్యవస్థను విస్తరించేందుకు నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఏర్పాటైంది. 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే వరకు సికింద్రాబాద్ స్టేషనే ఈ రైల్వే వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా కొనసాగింది. తర్వాత 1951లో నిజాం రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వేలో విలీనం అయింది. కాలం మారినా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు.

ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ తరహాలో పునర్నిర్మాణం

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దీనిని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ తరహా సదుపాయాలు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలతో ఈ స్టేషన్ కొత్త రూపు దిద్దుకుంటోంది.

Read Also: ఈ రైల్వే స్టేషన్‌ నుంచి నడుచుకుంటూ పక్క దేశానికి వెళ్లిపోవచ్చు!

Tags

Related News

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

Big Stories

Advertisement
×