E-Paper
Advertisement

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!
Advertisement

Shenzhen Futuristic Library: లైబ్రరీ అంటే సాధారణంగా పుస్తకాలతో నిండిన గదులు, వరుసగా అమర్చిన షెల్ఫ్‌ లు, నిశ్శబ్దంగా చదువుకునే పాఠకులు గుర్తుకొస్తారు. కానీ, చైనాలోని షెన్‌జెన్‌ లో ఉన్న లైబ్రరీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దీన్ని చూస్తే లైబ్రరీకి వచ్చామా? లేక ఏదైనా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టామా? అనే అనుభూతి కలుగుతుంది. అద్భుతమైన నిర్మాణ శైలి, ఆధునిక టెక్నాలజీ, ఊహకు అందని డిజైన్లతో ఈ లైబ్రరీ పుస్తక ప్రియులను మాత్రమే కాదు.. ఆర్కిటెక్చర్‌ ను ఇష్టపడేవారిని కూడా ఆకట్టుకుంటోంది.

అడుగడుగునా అద్భుతమైన డిజైన్

ఈ లైబ్రరీలోకి అడుగుపెట్టిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించేది భారీ సర్పిలాకార మెట్లు. సాధారణంగా లైబ్రరీల్లో మెట్లు కేవలం పై అంతస్తులకు వెళ్లేందుకు మాత్రమే ఉంటాయి. కానీ, ఇక్కడ మెట్లనే భవనం అందంలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చేశారు. చుట్టూ కనిపించే అద్దాలు కూడా ఈ ప్రదేశానికి మరో ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అద్దాల్లో భవనం ప్రతిబింబాలు పదేపదే కనిపించడంతో ఎక్కడ ముగుస్తుందో, ఎక్కడ మొదలవుతుందో అర్థం కాని విధంగా ఒక మాయలా అనిపిస్తుంది. లోపల నడుస్తుంటే ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

తేలియాడుతున్నట్టుగా పుస్తకాలు

Advertisement

ఈ లైబ్రరీలో మరో ఆసక్తికరమైన విషయం పుస్తకాలు అమర్చే విధానం. కొన్ని డిజైన్లు పుస్తకాలు గాల్లో తేలుతున్నట్లుగా కనిపించేలా రూపొందించారు. సాధారణ బుక్‌ షెల్ఫ్‌ లకు భిన్నంగా కనిపించే ఈ ఏర్పాట్లు సందర్శకులను వెంటనే ఆకర్షిస్తాయి. పుస్తకాలు చదవడానికి వచ్చినవారికి ఒకవైపు విజ్ఞానం అందుతుండగా.. మరోవైపు చుట్టూ ఉన్న నిర్మాణం, డిజైన్లు వారికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

మనుషులకు బదులు రోబోలు

ఈ లైబ్రరీలో టెక్నాలజీకి కూడా పెద్దపీట వేశారు. పుస్తకాలను మెయింటెయిన్ చేసే బాధ్యతను రోబోలకు అప్పగించారు. పుస్తకాలను సర్దే పని నుంచి పలు రకాల పనులను ఇక్కడ రోబోలే చేస్తాయి. అందుకే ఈ లైబ్రరీ సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది. పుస్తకాలను గుర్తించడం, వాటిని సరైన స్థానాల్లో ఉంచడం లాంటి పనులు కూడా రోబోలే చేస్తున్నాయి.

సినిమా ప్రపంచాన్ని తలపించేలా..   

Advertisement

ఈ లైబ్రరీలోని భారీ మెట్లు, అద్దాల ప్రతిబింబాలు, ప్రత్యేకమైన పుస్తకాల అమరిక అన్నీ కలిపి ఒక అద్భుతమైన విజువల్ వండర్ ను క్రియేట్ చేస్తున్నాయి. అందుకే, దీన్ని చూసిన చాలామంది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా ‘ఇన్సెప్షన్’ లాంటి సినిమాల్లో కనిపించే వింత నిర్మాణాలను తలపించేలా కొన్ని ప్రాంతాలు కనిపిస్తాయి.

లైబ్రరీకి కొత్త నిర్వచనం!

పుస్తకాలు చదివే ప్రదేశం అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే నిశ్శబ్ద గది కాదని ఈ లైబ్రరీ నిరూపిస్తోంది. ఆధునిక ఆర్కిటెక్చర్, టెక్నాలజీ, సృజనాత్మకత కలిస్తే ఒక లైబ్రరీ కూడా సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించగలదని చాటి చెప్తోంది. అందుకే షెన్‌జెన్‌లోని ఈ భవనం ఇప్పుడు పుస్తక ప్రియులతో పాటు.. అద్భుతమైన నిర్మాణాలను చూడాలనుకునే వారికి ఆకర్షణీయమైన ప్రదేశంగా నిలుస్తోంది.

Read Also: ఒకప్పుడు జైలు.. ఇప్పుడు లగ్జరీ హోటల్.. ఈ వింత ప్రదేశం ఎక్కడ ఉందంటే?

Tags

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×