E-Paper
Advertisement

క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?

క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?
Advertisement

Cleopatra Beauty Secrets: ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆమె అందం. అందానికి మించిన తెలివితేటలు ఆమె సొంతం. వేల సంవత్సరాలు గడిచినా ఆమె సౌందర్యం గురించి ఇప్పటికీ కథలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, క్లియోపాత్రా అందం పుట్టుకతో వచ్చినదేనా? లేక ఆమె పాటించిన సహజమైన పద్ధతులు కారణమా? అనే అంశంపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన కొన్ని ఆధారాల్లో ఆమె అందం గురించి ప్రస్తావనలు కనిపించినప్పటికీ, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ప్రతి బ్యూటీ సీక్రెట్‌ ను క్లియోపాత్రా నిజంగా పాటించిందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ, ఆమె పాటించిన కొన్ని పద్ధతులు ఇప్పటికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

గాడిద పాలు, తేనెతో స్నానం!

క్లియోపాత్రా గాడిద పాలు, తేనె కలిపిన నీటితో స్నానం చేసేదనే విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. గాడిద పాలలో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగించడంలో సాయపడేది. తేనె చర్మాన్ని తేమగా ఉంచే గుణాలను కలిగి ఉంటుంది. అయితే, ఆమె ప్రతిరోజూ ఇలాంటి స్నానం చేసేదని చెప్తుంటారు.

నేచురల్ ఆయిల్స్

Advertisement

ఈజిప్ట్‌ లో వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది. అందువల్ల చర్మాన్ని పొడిబారకుండా ఉంచేందుకు పురాతన కాలంలో పలు రకాల సహజ నూనెలను ఉపయోగించేవారు. క్లియోపాత్రా కూడా బాదం నూనె, నువ్వుల నూనె, మునగ నూనె లాంటి వాటిని ఉపయోగించేదని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఇలాంటి నూనెలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడేవి. ముడతలను కూడా చాలా వరకు తగ్గించేవి.

సముద్రపు ఉప్పు 

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ఉప్పును ఉపయోగించడం కూడా పురాతన ఈజిప్ట్‌ లో కనిపించే పద్ధతుల్లో ఒకటి. క్లియోపాత్రా డెడ్ సీ ఉప్పుతో స్క్రబ్ చేసుకునేదనే ప్రచారం ఉంది. ఉప్పుతో చర్మాన్ని రుద్దడం వల్ల మృత కణాలు తొలగిపోయేవి.

కళ్లకు కాటుక

Advertisement

క్లియోపాత్రా చిత్రాల్లో కనిపించే ప్రత్యేకమైన కంటి మేకప్ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అప్పట్లో ఈజిప్టులో కాటుక లేదంటే కోల్‌ను కళ్ల చుట్టూ ఉపయోగించడం సాధారణం. ఇది అందంతో పాటు సూర్యకాంతి నుంచి కొంత రక్షణ ఇస్తుందని భావించేవారు.

రోజ్ వాటర్, కలబంద

గులాబీ నీటిని చర్మ సంరక్షణలో ఉపయోగించడం, అలాగే కలబందను చర్మానికి రాసుకోవడం వంటి పద్ధతులు కూడా క్లియోపాత్రా పాటించేది. ముఖ్యంగా వేడి వాతావరణంలో కలబంద చర్మానికి చల్లదనాన్ని, తేమను కలిగించేది.

అందానికి మించిన తెలివి

క్లియోపాత్రా గురించి మాట్లాడేటప్పుడు ఆమె అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, ఆమెకు ఉన్న అసలు బలం తెలివి. ఆమె అత్యంత తెలివైన పాలకురాలు. అనేక భాషలు మాట్లాడగలిగేది. రాజకీయ పరిజ్ఞానం, సంభాషణలో చాతుర్యం కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే క్లియోపాత్రా కథ మనకు చెప్పేది ఒక్కటే.. అందం అనేది కేవలం ముఖంలో ఉండేది మాత్రమే కాదు. తెలివి, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కలిసినప్పుడే ఒక వ్యక్తి మరింత ఆకర్షణీయం మారే  అవకాశం ఉంటుంది. క్లియోపాత్రా కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే.

Read Also: అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

Tags

Related News

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

లాంగ్ హాలిడే అవసరం లేదు.. 2 రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ చేయగల 7 బెస్ట్ డెస్టినేషన్స్

గోవా-ఢిల్లీ ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య, వెంటనే అత్యవసర ల్యాండింగ్

టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

ఒకప్పుడు జైలు.. ఇప్పుడు లగ్జరీ హోటల్.. ఈ వింత ప్రదేశం ఎక్కడ ఉందంటే?

ప్రభుత్వం నిర్వహించే కైలాస యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ‘ప్రైవేట్‌‌’తో పోల్చితే ఏది బెటర్?

గాలిలో వేలాడుతున్న ట్రాక్.. షిమ్లా టాయ్ ట్రైన్లకు బ్రేక్!

Big Stories

Advertisement
×