E-Paper
Advertisement

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!
Advertisement

Fake Swami: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ ఫేక స్వామీజీ బండారం బట్టబయలైంది. సంతాన ప్రాప్తి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తానంటూ నమ్మించి అమాయకులైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ దంపతుల వద్ద దాదాపుగా రెండు కోట్లకు పైగా డబ్బు కాజేసిన సంఘటన కలకలం రేపుతుంది.

ఆశ్రమం ముసుగులో దందా..

ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మేళ్ళచెరువు సమీపంలో నైమిసారణ్యం ఆశ్రమం నిర్వహిస్తూ రమణ పొలకల స్వామి అలియాస్ రమణానంద మహర్షి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్టు దంపతులు పేర్కోన్నారు. అయితే బెంగళూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు శ్యామల, ఆనంద దంపతులకు పదేళ్లుగా సంతానం లేదు. దీంతో దీన్ని ఆసరగా చేసుని దందాకు తెరలేసినట్టు దంపతులు పేర్కోన్నారు. మధ్యవర్తులైన శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి అనే వ్యక్తులు స్వామీజీ చాలా శక్తిమంతుడని ఈయన వద్దకు వెలితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని దంపతులను నమ్మించారు.

Advertisement

Also read: ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

రూ. 2 కోట్లకు పైగా వసూలు..

మంచి జరగడం కోసం కొన్ని హోమాలు, ప్రత్యేక పూజలు, వాస్తు దోషాలు, డైట్ ప్లాన్ల పేరుతో స్వామీజీ విడతల వారీగా భాదితుల నుండి భారీగా నగదును గుంజాడు. అంతటితో ఆగకుండా వారితో త్రీబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను సైతం అమ్మించి దాదాపు 800 గ్రాముల బంగారాన్ని కాజేసాడు. దీంతో మోత్తం ఆ దంపతులు వద్ద రూ. 2 కోట్ల 17 లక్షల వరకు వసూలు చేసాడని భాదితులు వాపోయారు.

అడిగితే బెదిరింపులు..

Advertisement

అయితే వారి సమస్య తీరక పోవడంతో పాటు, భాదితుని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడం, తనకు మరోసారి గర్భస్రావం జరగడంతో మోసపోయామని దంపతులు గ్రహించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తమ ఆస్తులు, నగదు వెనక్కి ఇవ్వాలని కోరితే స్వామీజీ వారిని అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు దంపతులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరతున్నారు. భాద్యులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Also read: మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Tags

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×