E-Paper
Advertisement

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ  జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
Advertisement

Elon Musk’s Luxury Gulfstream Jet: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్.. ఒకేసారి బోలెడు కంపెనీలను నడిపిస్తున్నారు. టెస్లా, స్పేస్‌ ఎక్స్, ఎక్స్, xAI లావటి సంస్థలతో బిజీగా ఉండే మస్క్.. తన ప్రయాణాల కోసం సాధారణ విమానాలను కాకుండా అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లను ఉపయోగిస్తుంటారు. ఆయన విమానాల జాబితాలో గల్ఫ్‌ స్ట్రీమ్ G650ERతో పాటు G700, G800 లాంటి అత్యాధునిక జెట్లు ఉన్నాయి.

ధర రూ.600 కోట్లకు పైమాటే!

మస్క్ ఉపయోగించే గల్ఫ్‌ స్ట్రీమ్ జెట్ల ధరలు సామాన్యులకు ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటాయి. G650ER, G700 వంటి విమానాల ధర సుమారు 70 నుంచి 78 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లకు సమానం. అయితే, విమానం కొనుగోలు ధరతో పాటు దాని మెయింటెనెన్స్, సిబ్బంది, ఇంధనం ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి.

గంటకు 1,100 కిలోమీటర్ల వేగం

Advertisement

ఈ ప్రైవేట్ జెట్ల మరో ప్రత్యేకత వాటి వేగం. గల్ఫ్‌ స్ట్రీమ్ విమానాలు దాదాపు మాక్ 0.9 వేగంతో ప్రయాణిస్తాయి. అంటే, గంటకు 1,100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఎక్కువ దూరాలను తక్కువ సమయంలో చేరుకోవడానికి ఈ వేగం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆగకుండా వేల కిలోమీటర్ల ప్రయాణం

మస్క్ జెట్ల ప్రత్యేకత వాటి ప్రయాణ పరిధి. మోడల్‌ను బట్టి ఇవి దాదాపు 7,500 నుంచి 8,200 నాటికల్ మైళ్ల వరకు అంటే, అంటే 13,890 కిలోమీటర్ల నుంచి 15,186.4 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అంటే, ఇంధనం కోసం మధ్యలో ఆగాల్సిన అవసరం లేకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వ్యాపార పనుల కోసం ప్రపంచంలోని వివిధ దేశాలకు తరచూ వెళ్లే మస్క్‌ కు ఈ సామర్థ్యం ఎంతో కీలకం.

గాల్లోనే లగ్జరీ ఆఫీస్

Advertisement

మస్క్ జెట్‌లో అత్యాధునిక సౌకర్యాలకు కూడా కొదవలేదు. ముఖ్యంగా G700లో ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన లివింగ్ జోన్లు ఉంటాయి. డైనింగ్ ఏరియా, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్, కాన్ఫరెన్స్ ఏరియా, బెడ్‌ రూమ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. కొన్ని సీట్లు, సోఫాలను అవసరాన్ని బట్టి పడుకునేలా మార్చుకోవచ్చు.

బెడ్‌రూమ్‌తో పాటు షవర్ కూడా..

సుదీర్ఘ ప్రయాణాల్లో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక బెడ్‌రూమ్ ఉండటం ఈ విమానాల్లో మరో ఆకర్షణ. అంతేకాదు.. కొన్ని కాన్ఫిగరేషన్లలో ప్రత్యేక షవర్ సౌకర్యం కూడా ఉంటుంది. పెద్ద ఓవల్ ఆకారంలోని కిటికీల వల్ల విమానం లోపల సహజమైన వెలుతురు ఎక్కువగా ఉంటుంది.

గాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్

టెక్నాలజీ విషయంలోనూ ఈ జెట్‌లు ముందుంటాయి. స్పేస్‌ ఎక్స్‌ కు చెందిన స్టార్‌లింక్ కనెక్టివిటీని విమానంలో ఉపయోగించడం వల్ల గాల్లో ప్రయాణిస్తున్న సమయంలోనూ వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. దీంతో మస్క్ ప్రయాణంలో ఉన్నప్పటికీ తన కంపెనీలకు సంబంధించిన పనులను కొనసాగించగలుగుతున్నారు. ఎలాన్ మస్క్‌ కు ఈ ప్రైవేట్ జెట్లు కేవలం విలాసవంతమైన ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించేందుకు ఉపయోగపడే మొబైల్ ఆఫీస్‌లుగా కూడా పనిచేస్తున్నాయి.

Read Also: గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

Tags

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×