Amaravati: ఏపీలో రాజకీయాలు వెరైటీగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేసినా, టీడీపీకి క్రెడిట్ ఇవ్వడానికి వైసీపీ అస్సలు అంగీకరించలేదు. దాని క్రెడిట్ అంతా మాదేనని, లేకుంటే మా నాన్న చేశారంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలు వెలిగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రకు గోదావరి వాటర్ విషయంలోనూ అదే చేసింది. క్రెడిట్ చోరీ విషయంలో సీఎం చంద్రబాబు ఏమన్నారు?
ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు ఇచ్చిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వైసీపీ తీరుని ఎండగడుతూనే, క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. డేటా సెంటర్ మేమే తెచ్చాం.. భోగాపురం ఎయిర్‌పోర్టు మేమే కట్టామని వైసీపీ చెబుతోందని, అందరూ ఎగతాళి చేస్తే చివరకు రిప్లై ఇవ్వకుండా నేతలు సైలెంట్ అయ్యారని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం మేమే తవ్వామని అన్నారని, చివరకు అక్కడి ప్రజలు వాళ్లని ఛీకొట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇప్పుడు అనకాపల్లికి గోదావరి నీళ్లు తెచ్చామని, ఇది కూడా మేమే చేశామని పేటీఎం సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభిస్తారని వివరించారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగానే ఈసారి నేరుగా రంగంలోకి జగన్ దిగేశారు. ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పురుషోత్తపట్నం పంపులతో నీళ్లు ఎత్తి పోలవరం నీళ్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పురుషోత్తపట్నం పంపులు.. పోలవరం ఎడమ కాలువ ఇప్పటికే ఉన్నాయన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు 79 శాతం వైఎస్ హయాంలో పూర్తి అయ్యాయని చెబుతూ నాన్న ఖాతాలో క్రెడిట్ వేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం.
ఏం చేయకుండానే ప్రాజెక్టులకు క్రెడిట్ తీసుకొంటున్నారని, సాగునీటి ప్రాజెక్టులపై వరుసగా పబ్లిసిటీ ఈవెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు పోలవరం ఎత్తు విషయాన్ని తెరపైకి తెచ్చారు మాజీ ముఖ్యమంత్రి. పోలవరం ఎత్తు 45.72 మీటర్లయితే నీటి నిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారని అన్నారు. కేంద్రం 41.15 మీటర్ల వరకు నిధులిస్తామని చెబుతోందని, పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? కొత్త మెలిక పెట్టే ప్రయత్నం చేశారు. పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ మాటేంటి? నిర్వాసితులకు ప్యాకేజీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు మాజీ సీఎం జగన్. రాబోయే రోజుల్లో దీనిపై సీఎం చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వెయిట్ అండ్ సీ.
Today is a historic day. The industrial ecosystem of Vizag, and specifically the data centers, will get water from the Polavaram Left Main Canal. The people of Visakhapatnam need not have any apprehension about water availability. While all five proposed data centres together… pic.twitter.com/rOyzaRHmLF
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2026
.@ncbn గారూ… ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి, ఆ ఇప్పటికే ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని చూపించి “పోలవరం నీళ్లు తెచ్చేశాం” అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి? పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ… pic.twitter.com/Wplm9CrzTh
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026