E-Paper
Advertisement

CM Jagan : సీఎం ఇంట ఉగాది సందడి..పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?

CM Jagan : సీఎం ఇంట ఉగాది సందడి..పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?
Advertisement

CM Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌ నివాసంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా గోశాలలో ఉగాది వేడుకలు జరిగాయి. పంచెకట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు శ్రీవేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్‌ దంపతులు పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు.

నూతన పంచాంగాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్‌ దంపతులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కప్పగంతు సుబ్బరాయ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్‌ నామ సంవత్సరంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరాయ సోమయాజి తెలిపారు. ఉద్యోగులు, శ్రామికులు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని వివరించారు. ఆహార ఉత్పత్తులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈకార్య‌క్ర‌మంలో మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, కొంతమంది వైసీపీ నాయ‌కులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. గోడలకు ఏర్పాటు చేసిన దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొంటూ సీఎం జగన్ ట్వీట్‌ చేశారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×