BigTV English

Rajamouli : రాజ‌మౌళి అవమానించారు..సీనియ‌ర్ న‌టి కాంచ‌న సంచ‌ల‌న కామెంట్స్‌

Rajamouli : రాజ‌మౌళి అవమానించారు..సీనియ‌ర్ న‌టి కాంచ‌న సంచ‌ల‌న కామెంట్స్‌
Rajamouli

Rajamouli : వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌న సినిమాల‌తో మాత్రం మాట్లాడే అతి కొద్ది మంది దర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌రు. ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఈయ‌న‌. ఆయ‌న తెర‌కెక్కించిన RRR చిత్రంలోని నాటు నాటు పాట‌కే ఆస్కార్ అవార్డ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దేశం మొత్తం రాజ‌మౌళిని ప్ర‌శంసిస్తుంటే సీనియ‌ర్ న‌టి కాంచ‌న మాత్రం ఆయ‌నపై విమ‌ర్శ‌లు చేశారు. ఓ సీనియ‌ర్ న‌టి రాజ‌మౌళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అస‌లు రాజ‌మౌళిపై కాంచ‌న ఎందుకు కామెంట్స్ చేసింద‌నే వివ‌రాల్లోకి వెళితే..


రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో కాంచ‌న రాజ‌మౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. రెండు రోజుల నటించాలని అడిగారు. నేను రెమ్యూనరేషన్ కింద ఐదు లక్ష‌లు అడిగాను. అయితే అది నాకు ఎక్కువ అని ఆయ‌న భావించి నన్ను సినిమాలో తీసుకోలేదు. ఐదు ల‌క్ష‌లు నాకు పెద్ద మొత్తం కాదు. రాజ‌మౌళికి కూడా పెద్ద మొత్తం కాదు. నాలాంటి వారికి ఇస్తే ఎంతో మందికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ముస‌లి హీరోల‌కు మాత్రం ఎలా ఇస్తారు? ఇక్క‌డ నేనెవ‌రినీ ఉద్దేశించి కామెంట్స్ చేయ‌టం లేదు. కానీ ఆర్టిస్టుల క‌ష్టాల‌ను తెలిసి కామెంట్స్ చేస్తున్నాను’’ అన్నారు.

బాహుబ‌లి సినిమాలో ఏ పాత్ర‌కు కాంచ‌న‌ను న‌టింప చేయాల‌ని రాజ‌మౌళి భావించారో తెలియ‌దు. కానీ.. కాంచ‌న ఇప్పుడు రాజ‌మౌళి త‌న‌ను అవ‌మానించారంటూ కామెంట్స్ చేయ‌టం డిస్క‌ష‌న్ పాయింట్ అయ్యింద‌. మ‌రి దీనిపై జ‌క్క‌న్న ఎలా స్పందిస్తారో చూడాలిక‌. బాహుబ‌లి త‌ర్వాత RRR సినిమాను రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని పాట‌కే ఆస్కార్ అవార్డ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నెక్ట్స్ మూవీగా సూపర్ స్టార్ మహేష్‌తో సినిమా చేయబోతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×