E-Paper
Advertisement

Horoscope 2023 : ఉగాదితో మూడు రాశుల వారికి రాజయోగం..మిగిలిన వాటి సంగతేంటి.

Horoscope 2023 : ఉగాదితో మూడు రాశుల వారికి రాజయోగం..మిగిలిన వాటి సంగతేంటి.
Advertisement
Horoscope 2023

Horoscope 2023 : శోభకృత్ నామ సంవత్సర ఉగాదితో మూడు రాశుల జాతకం మారబోతోంది.మీనరాశిలో బృహస్పతి మరియు చంద్రుడి కలయిక గజకేసరి రాజయోగాన్ని కలిగిస్తుంది. మీనరాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బలంగా ఉంటుంది. డబ్బుకు ఏ విధమైన లోటు ఉండదు

గజకేసరి రాజయోగం అంటే..
గజము అంటే ఏనుగు అని, కేసరి అంటే సింహమని అర్థం. ఏనుగు సింహం రెండూ కూడా చాలా బలమైన జంతువులు కావడంతో, ఆయా జాతకులకు అన్ని విషయాలలోనూ గజకేసరి రాజయోగంతో బలం చేకూరుతుందని, వారు విశేషమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, ఏ పని చేసినా తిరుగులేని విషయాన్ని సాధిస్తారని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు.. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో గజకేసరి రాజయోగం అంటే అన్ని శుభాలని ఇచ్చే సమయం.

Advertisement

సింహరాశి
చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు ఉగాది రోజు మీనరాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో సింహరాశి జాతకులకు తిరుగులేకుండా ఉంటుంది. సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా ఎంతో మంచిఫలితాలను ఇవ్వబోతోంది. ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

మీనం
గజకేసరి యోగంతో మీన రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీనరాశిలోని లగ్న గృహంలో గజకేసరి యోగంతో మీనరాశి జాతకుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతుంది. మీనరాశి జాతకులకు లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. ఏ పని చేసినా కూడా సమయం అనుకూలిస్తుంది, అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు, రచనలు , చదువులతో సంబంధం ఉన్నవారు ఈ సంవత్సరం చాలా కీర్తి, ప్రతిష్టలను పొందుతారు.

Advertisement

మిధునం
మిధున రాశి జాతకులకు ఈ సంవత్సరం బృహస్పతి మీ రాశిలో ఉగాది నుండి ఆధిపత్యం చెలాయించే స్థానంలో ఉంటాడు. దీంతోపాటు గజకేసరి రాజయోగంతో ఉద్యోగాలు ,వృత్తులలో ఎన్నో మంచి మార్పులకు అవకాశం కలుగుతుంది. వ్యక్తుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×