Vidadala Rajini: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక పోలీసుల వైఖరిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన సమయంలో మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.
విడుదల రజినిలో ఇంట్లో షాకింగ్ సీన్
కూటమి ప్రభుత్వంలో పోలీసులు ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమల్లోకి తెచ్చారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన 24 గంటలు గడవకముందే ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. యడ్లపాడు ZPTC అభ్యర్థి బుల్లబ్బాయి నామినేషన్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారని తెలుసుకున్న మాజీ మంత్రి విడదల రజిని, ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు ఆమెను బయటకు వెళ్లకుండా దారి కాశారు. తన ఇంట్లో నుంచే బయటకు వస్తున్న రజినిని విధుల్లో ఉన్న సీఐ ప్రియాంక ఒక్కసారిగా వెనక్కి నెట్టివేశారు. ఈ ఊహించని తోపులాటలో బ్యాలెన్స్ తప్పిన రజిని కిందపడిపోయారు. వెంటనే తేరుకుని పైకి లేచిన రజిని, ‘నన్ను చంపడానికి వచ్చావా?’ అని సీఐని నిలదీయగా.. ‘ మీరు ఏమైనా అనండి.. బయటకు రానిచ్చే ప్రసక్తే లేదు’ అంటూ పోలీసులు మళ్లీ ఆమెను నెట్టివేశారు.
వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి పోలీసు అధికారుల గౌరవాన్ని పొందిన నేత పట్ల, సొంత ఇంట్లోనే ఇలా గేట్ దాటొద్దంటూ దౌర్జన్యానికి దిగడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వైసీపీ అభివర్ణించింది. పోలీసుల ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసనకు దిగడంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.
Also Read: నామినేషన్ల గడువు 48 గంటలు పెంచాల్సిందే! ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్
వైసీపీ డిమాండ్..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల అరెస్టులు, నామినేషన్లు వేయకుండా అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వినుకొండలో కూడా వైసీపీ MPTC మహిళా అభ్యర్థి తొడకొట్టి ‘నామినేషన్ పత్రాలు చింపడం కాదు.. ధైర్యముంటే పోటీ చేసి గెలవండి’ అని సవాల్ విసరడం గమనార్హం. చిలకలూరిపేటలో మాజీ మంత్రినే కింద పడేసిన షాకింగ్ దృశ్యాలు, వినుకొండలో తొడకొట్టిన సవాల్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాధ్యులైన అధికారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ తీవ్రంగా డిమాండ్ చేస్తోంది.
ఎస్‌ఐ నెట్టివేయడంతో కిందపడ్డ విడదల రజిని
చిలకలూరిపేటలో పోలీసుల తీరు ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్‌ఐ ప్రియాంక నెట్టివేయడంతో మాజీ మంత్రి విడదల రజిని కిందపడిపోయారు. పోలీసుల దౌర్జన్యంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో మాజీ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు… pic.twitter.com/qYky0UuaDq
— BIG TV Breaking News (@bigtvtelugu) October 23, 2026