BigTV English
Advertisement

Vizag Miss Nakshatra protest: మిస్ వైజాగ్ నక్షత్ర, ఇంటి పోరు.. భర్త ఇంటి వద్ద ఆందోళన

Vizag Miss Nakshatra protest: మిస్ వైజాగ్ నక్షత్ర, ఇంటి పోరు.. భర్త ఇంటి వద్ద ఆందోళన

Vizag Miss Nakshatra Protest(Andhra pradesh today news): వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. తన భర్త గురించి అసలు నిజాలు తెలుసుకుని లోలోపల కుమిలిపోయింది ఆ ఇల్లాలు. అయినా సరే తన భర్తను వదల్లేదు. తనకు భర్త కావాలంటూ నిరసనకు దిగింది. మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా భర్తను పట్టుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన విశాఖ సిటీలో చోటు చేసుకుంది.


ఆ ఇల్లాలు ఎవరో కాదు మిస్ వైజాగ్, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్ నక్షత్ర. సీన్ కట్ చేస్తే.. 11 ఏళ్ల కిందట వెనక్కి వెళ్తే.. ఓ మూవీ షూటింగ్‌లో నక్షత్ర-వెంటకసాయి తేజ‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. చివరకు పెళ్లికి దారి తీసింది. మనసులు ఒక్కటి కావడంతో నక్షత్ర-సాయితేజ 2017 లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది.

సజావుగా సాగుతున్న సంసారంలో ఏం జరిగిందో తెలీదు. భార్య నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే భర్త సాయి తేజ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర, మీడియాకు తన భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టించింది. అంతేకాదు ఆ సన్నివేశాన్ని చూసి  తట్టు కోలేకపోయిన నక్షత్ర. భర్త చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో భార్యభర్తల మధ్య వ్యవహారం బయటకు వచ్చింది.


ALSO READ: వైసీపీ కవ్వింపు చర్యలు, జనసైనికులు జాగ్రత్త అంటూ…

భర్త గురించి అసలు విషయాలు బయటపెట్టింది నక్షత్ర. పబ్జీ గేమ్ ఆడి అమ్మాయిలను ట్రాప్ చేశాడని ఆరోపించింది. తనతో సాయితేజ మాట్లాడిన ఆడియో, వీడియోలు ఉన్నాయని చెబుతోంది. తనకు రోజుకో మహిళ కావాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో భర్త ఇంటి వద్ద నిరసనకు దిగింది. తానింకా డైవోర్స్ ఇవ్వలేదని చెబుతోంది నక్షత్ర. మరి ఈ వ్యవహరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Tags

Related News

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Ap Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త.. కేవలం 20 రోజులే, ఇంకెందుకు ఆలస్యం

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ambati Rambabu: రూటు మార్చిన అంబటి రాంబాబు .. ఈసారి తిరుమలలో ప్రశంసలు, షాక్‌లో వైసీపీ నేతలు

Karthika Vanabhojanam: ఐదేళ్ల విరామం తర్వాత.. తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజన మహోత్సవం

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Big Stories

×