BigTV English

Ganguly Advice to BCCI on New coach: బీసీసీఐకి గంగూలీ సలహా, కొత్త కోచ్ ఎంపికపై..

Ganguly Advice to BCCI on New coach: బీసీసీఐకి గంగూలీ సలహా, కొత్త కోచ్ ఎంపికపై..

Ganguly Advice to BCCI on New coach: టీమిండియా కొత్త కోచ్ ఎవరు? ఇండియన్ లేదా ఫారెన్ వ్యక్తా ? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. కొత్త కోచ్ పదవికి దరఖాస్తు గడువు ముగిసింది. ఎంత మంది అప్లై చేశారన్నది బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇంతకీ సెలక్షన్ ఎప్పుడు? జూన్‌లో టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఎంపిక జులైకి వాయిదా వేస్తారా? ఇవే ప్రశ్నలు చాలామంది క్రికెట్ అభిమానులను వెంటాడుతున్నాయి.


తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ.. బీసీసీఐకి ఓ సలహా ఇచ్చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు  చేశాడు. కోచ్ పదవి కోసం వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు తెలివి ప్రదర్శించా లని రాసుకొచ్చాడు. మార్గదర్శిగా, కనికరం లేని శిక్షణతో అత్యుత్తమ ఆటగాళ్లను మార్చాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపై ఉంటుందన్నాడు. ముఖ్యంగా ప్రతీ ఆటగాడి జీవితంలో కోచ్ పదవి అత్యంత ముఖ్యమైనది వర్ణించాడు.

ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. కొత్త కోచ్ జులై ఒకటి నుంచి బాధ్యతలు తీసుకోవాల్సివుంది. ఇప్పుడు బీసీసీఐ ఎవర్ని ఎంపిక చేస్తారనేది అసలు ప్రశ్న. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్, ఆశిష్‌నెహ్రా సహా మరో ఇద్దరు రేసులో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నెహ్రాను పక్కనబెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాకపోతే బౌలింగ్ కోచ్‌గా తీసుకునే అవకాశాలున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది.


ALSO READ: ఇవిగో.. ఆ నాలుగు ఫైనలిస్టు జట్లు..! జోస్యం చెబుతున్న సీనియర్లు..

కొత్త కోచ్ బాధ్యతలు తీసుకున్నాక జులై నుంచి టీమిండియా- శ్రీలంకల మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లున్నాయి. ఆస్ట్రేలియా టూర్ ఉండబోతోంది. 2025 ఏడాదిలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోపీ టోర్నీ ఉంది. 2026లో ఇండియా- శ్రీలంక దేశాలు టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరుసటి ఏడాది అంటే 2027లో సౌతాఫ్రికా వేదికగా వన్డే కప్ టోర్నమెంట్ ఉండనుంది. అప్పటి వరకు కొత్త కోచ్ ఉంటాడు. ఈ షెడ్యూల్‌ను పరిశీలిస్తే ఎవరెవరు ఆ పదవికి అప్లై చేసుకున్నారనేది తెలిస్తే, ఓ అంచనాకు రావచ్చని అంటున్నారు.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×