BigTV English

Budget Car from Kia: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?

Budget Car from Kia: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?

Kia Carens Facelift Budget Car Launch: దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా అతి తక్కువ టైమ్‌లోనే భారత మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే కియా త్వరలో కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. దీన్ని తక్కువ బడ్జెట్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ MPV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ దేశంలోని రోడ్లపై టెస్టింగ్ సమయంలో మొదటిసారిగా కనిపించింది. అందులో ఎలాంటి మార్పులు చేయవచ్చు. తదితర వివరాలు తెలసుకుందాం.


కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. కేరెన్స్‌ను కియా బడ్జెట్ MPV సెక్షన్‌లో తీసుకురానుంది. కియా తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారతదేశంలో మొదటిసారిగా టెస్ట్ చేసింది. ఈ సమయంలో ఇది రోడ్లపై కనిపించింది.

నివేదికల ప్రకారం.. దీని డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. దీని ఫ్రంట్ బంపర్, హెడ్‌లైట్లలో కొన్ని ఛేంజెస్ చేయవచ్చు. ఇది కాకుండా దీనికి కొత్త అల్లాయ్ వీల్స్, బ్యాక్ పార్ట్‌లో కనెక్టెటెడ్ LED లైట్ ఇవ్వవచ్చు. ఇంటీరియర్‌లో కూడా పెద్దగా మార్పులు ఉండవు. కానీ ఇది 10.25 అంగుళాల స్క్రీన్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు పనోరమిక్ రూఫ్‌తో తీసుకురావచ్చు.


Also Read: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్.. అరేయ్ ఏముంది మామా!

సేఫ్టీ కోసం కియా కేరన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో ADAS కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్లలో చాలా వరకు కొన్ని వేరియంట్‌లలో మాత్రమే అందించబడినప్పటికీ డిజైన్‌లో మార్పులు అన్ని ఈ  వేరియంట్‌లలో తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంజిన్ విషయానికి వస్తే నివేదికల ప్రకారం కంపెనీ తన ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత వేరియంట్‌లో ఉన్నట్లుగా ఇది 1.5 లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందించబడుతుంది. దీనితో 6 స్పీడ్ మాన్యువల్, IMT, 7 స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ ఇవ్వవచ్చు.

Also Read: టయోటా లాండ్ క్రూయిజర్ కొత్త ఎడిషన్ లాంచ్.. ఆకట్టుకుంటున్న డిజైన్..!

ఈ MPV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రస్తుతం కంపెనీ టెస్ట్ చేస్తోంది. అంతే కాకుండా కియా దీనికి సంబంధించి ఎలాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే పండుగ సీజన్ ప్రారంభానికి ముందు కంపెనీ Carance ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×