E-Paper
Advertisement

Ambati Rambabu: నేను సంబరాల రాంబాబునా? మరి పవన్.. వీడియో రిలీజ్ చేసిన అంబటి

Ambati Rambabu: నేను సంబరాల రాంబాబునా? మరి పవన్.. వీడియో రిలీజ్ చేసిన అంబటి
Advertisement

Ambati Rambabu: ‘సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ డాన్స్ వేస్తే?’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేసిన ఓ వీడియో పెట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అక్కడ కళాకారులతో కలిసి పవన్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ట్రోల్ చేస్తూ.. తాను డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అన్నారని, మరి పవన్ కల్యాణ్ ఏమని పిలవాలన్నారు.

సంబరాల రాంబాబు

వైసీపీ అధికార సమయంలో సత్తెనపల్లెలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేవారు. ఈ సంబరాల్లో అంబటి రాంబాబు డ్యాన్స్ చేస్తూ అలరించేవారు. సంబరాల రాంబాబు.. అనే పాటలకు అంబటి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేది. అంబటి చేసిన డ్యాన్స్ ను అనుకరిస్తూ.. పవన్ నటించిన బ్రో సినిమాలో ఒక సీన్ సైతం పెట్టారు. అయితే 2024లో అధికారం మారడంతో.. ఈసారి కూటమి పార్టీలు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు కళాకారులతో కలిసి చిందేస్తున్నారు.

Advertisement

Also Read:  వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు

నెటిజన్లు కౌంటర్

Advertisement

పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో పవన్ డ్యాన్ చేసిన వీడియోను అంబటి పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పవన్ కల్యాణ్ డాన్స్ చేస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి, మీరు డాన్స్ చేస్తే సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తాయి అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘పవన్ జనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు, కానీ మీరు రాజకీయాల్లో ఉండి జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. తేడా అర్థమైందా రాంబాబు గారు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. సంక్రాంతి వేళ వీడియోలతో వైసీపీ, కూటమి పార్టీలు ట్రోల్ చేసుకుంటున్నాయి.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×