Allu Arjun: టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. దాదాపు 50% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక అల్లు అర్జున్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫ్యామిలీ అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి కూడా స్పందిస్తూ పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే నేడు తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన తండ్రికి పుట్టినరోజు (Birthday)శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలోనే బన్నీ తన తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి మీరే.. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి” అంటూ తన తండ్రిని దేవుడితో సమానంగా భావిస్తూ బన్నీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన బన్నీ అభిమానులు కూడా అల్లు అరవింద్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అరవింద్ అంటే బన్నీకి ఎంతో అపారమైన ప్రేమ గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాలలో ఈయన తన తండ్రిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ అయ్యారు.
Happy Birthday, Dad. The closest thing to God in my life. May you always live joyfully. 🖤 #AlluAravind pic.twitter.com/rcpLN4jJHM
— Allu Arjun (@alluarjun) January 10, 2026
తాజాగా అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక బన్నీ విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో బిజీగా ఉన్న బన్నీ త్వరలోనే మరొక తమిళ దర్శకుడు సినిమాతో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది . ఇప్పటికే ఈయన డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ (Lokesh Kanagaraj)తో సినిమాకు ఫిక్స్ అయ్యారని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది.
Also Read: MSVPG Film: తెలంగాణలోనూ పెరిగిన మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు.. జీవో జారీ!