E-Paper
Advertisement

Pawan Kalyan: వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు

Pawan Kalyan: వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు
Advertisement

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో వివాదం చిక్కుకున్నారు. పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ పర్యటనలో పవన్ చేసిన ఓ పని రాజకీయ దుమారం రేపుతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ పరిశీలిస్తున్న సమయంలో.. ఒకరు దేవుని ప్రతిమ అందించారు. ఈ ప్రతిమ స్వీకరించే సమయంలో పవన్ కల్యాణ్ షూ విప్పలేదు. పక్కనున్న వాళ్లు దీనిని వీడియోలు తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే పుస్తకం తీసుకునే సమయంలో.. అది కింద పడుతుంటే కనీసం పట్టుకోకుండా వదిలేశారని కామెంట్స్ చేస్తు్న్నారు.

వైసీపీ విమర్శలు

Advertisement

ఈ వీడియోను వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. పవన్ కల్యాణ్ కపట భక్తికి నిదర్శనమని విమర్శలు గుప్పించింది. ‘‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి అపచార పనులు’’ అంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, ఆచరణలో మాత్రం దైవ గౌరవాన్ని విస్మరించారని ఆరోపించింది. పవన్ కల్యాణ్, జగన్ వీడియోలు పక్కపక్కనే పెట్టి వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో జగన్ చెప్పులు విప్పి దేవుని ప్రతిమ తీసుకోగా.. పవన్ షూతో దేవుని ప్రతిమ పట్టుకున్నట్లు కనిపిస్తుంది.

Also Read: నేను నెం 1 కాదు… టాలీవుడ్‌లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ 

పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

Advertisement

ఈ సంక్రాంతి నుంచి కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయనే మాటలు పోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు” అన్నారు.

రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు

“గత 18 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత ఏడాది దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే… ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఇంత ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తాను. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం”- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×