E-Paper
Advertisement

YCP Attack on TDP Polling Agents in Macherla: ఏపీలో మొదలైన పోలింగ్.. మాచర్లలో వైసీపీ దాడులు.. ఈసీ ఆగ్రహం!

YCP Attack on TDP Polling Agents in Macherla: ఏపీలో మొదలైన పోలింగ్.. మాచర్లలో వైసీపీ దాడులు.. ఈసీ ఆగ్రహం!
Advertisement

YCP Attack on TDP Polling Agents in Macherla: ఆంధప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఓటర్లు.

పోలింగ్ మొదలుకాగానే వైసీపీ నేతల దాడులు మొదలయ్యాయి. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు వైసీపీ నేతలు. ఈ ఘటనలో టీడీపీ ఏజెంట్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు.

Advertisement

మాక్ పోలింగ్ తర్వాత రెగ్యులర్ పోలింగ్ మొదలైన క్రమంలో వైసీపీకి చెందిన ఏజెంట్లు.. టీడీపీ వాళ్లపై దాడులు చేశారు. ఈ ఘటలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రి తరలించారు.

Also Read: చంద్రబాబు ఇంటర్వ్యూ, ఈసీకి టీడీపీ ఫిర్యాదు, ఫేక్ వీడియో వెనుక,

Advertisement

ఈ విషయం తెలియగానే ఎన్నికల అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌కు ముందే పల్నాడులో గొడవలు జరగడంపై మండిపడ్డారు. అవసరమైతే అదనపు బలగాలను రంగంలోకి దించాలని జిల్లా అధికారులకు సూచన చేశారు. దీంతో పోలింగ్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

మరోవైపు పల్నాడు జిల్లా అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య వివాదం నెలకొంది. వైసీపీ నేతలు బూత్ లలో ప్రచారం చేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు సైలెంట్ గా ఉండడంతో వారితో వాగ్వాదానికి దిగారు టీడీపీ కార్యకర్తలు.

Also Read: Ysrcp Vs Tdp prediction in AP: వందేసి గెలుస్తామంటున్న వైసీపీ, టీడీపీలు, పోలింగ్ శాతంపై దృష్టి

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×