BigTV English

CM Jagan, Chandrababu, Lokesh Families: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా!

CM Jagan, Chandrababu, Lokesh Families: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా!

CM Jagan, Chandrababu Lokesh Families: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాకరాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు సీఎం జగన్.


అనంతరం మాట్లాడిన సీఎం జగన్, ఐదేళ్లగా తమ ప్రభుత్వ పాలన నచ్చితేనే ప్రజలు ఓటు వేయాలన్నారు. లబ్ది పొందామని భావిస్తేనే భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరారు.

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు చంద్రబాబు దంపతులు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

ఓటు వేసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓట్ల విషయంలో జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి అంటూనే, భవిష్యత్తును తీర్చిదిద్దేవని గుర్తు చేశారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భవిష్యత్తుకు పునాదులు వేస్తుందన్నారు.

పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వైసీపీ దాడులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.

Also Read: Elections in AP: చంద్రబాబు ఆగ్రహం.. మీరే తిప్పి కొట్టాలంటూ..

Also Read: AP: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..

Related News

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×