BigTV English

TDP Complaints to EC on YCP: చంద్రబాబు ఇంటర్వ్యూ.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. ఫేక్ వీడియో వెనుక..

TDP Complaints to EC on YCP: చంద్రబాబు ఇంటర్వ్యూ.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. ఫేక్ వీడియో వెనుక..

TDP Complaints to EC on YCP Social Media: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముందురోజు వైసీపీ అరాచకాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీపై వైసీపీ సోషల్‌మీడియా నెగిటివ్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇంకోవైపు ఓటర్ల చేత గుడిలో వైసీపీ నేత ప్రమాణం చేయించడం వంటి పరిణామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ.


తాజాగా చంద్రబాబు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూపై వైసీపీ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమ.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

ఇంటర్వ్యూలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు అన్నట్లు మార్పింగ్ చేసిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారాయన.


Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

ఈ ప్రచారం వెనుక వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అందులో ప్రస్తావించారు. అంతేకాదు నకిలీ వీడియో ప్రచారం కాకుండా అడ్డుకోవాలని కోరారు ఉమ.

మరోవైపు తిరుపతిలోని కొర్ల గుంట ఆంజనేయస్వామి ఆలయంలో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణాలు చేయించారు.  తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కేతన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఈ మేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ముఖ్యంగా ఆటో సంఘాలకు చెందిన పలువురు నాయకులు కర్పూరం వెలిగించి తమ ఓటు, కుటుంబ, బంధువుల ఓట్లు వైసీపీ అభ్యర్థికి వేస్తామంటూ ప్రమాణం చేయించారు.

Also Read: Chandrababu pawan in Varanasi: వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ

గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేతం మాట్లాడిన వీడియో ఒకటి వివాదాస్పదమైంది. ఫేక్ పేపర్స్‌తో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేద్రాలకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని పిలుపునివ్వడం అప్పట్లో దుమారం రేపిన విషయం తెల్సింది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×