E-Paper
Advertisement

Vijayawada Central Constituency : వెల్లంపల్లికి ఇన్ ఛార్జ్ బాధ్యతల.. మల్లాది అనుచరులు రాజీనామా అస్త్రాలు..

Vijayawada Central Constituency : వెల్లంపల్లికి ఇన్ ఛార్జ్ బాధ్యతల.. మల్లాది అనుచరులు రాజీనామా అస్త్రాలు..
Advertisement

Vijayawada Central Constituency : విజయవాడ సెంట్రల్ సీటు పంచాయితీ.. ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఒకరు సీటు కావాలంటుంటే మరొకరు సీటు వద్దు మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌ సీటుపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కనపెట్టి సెంట్రల్‌ స్థానాన్ని వైసీపీ అధిష్టానం వెల్లంపల్లికి కేటాయించింది.

మల్లాది విష్ణుకు సీటు ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే వెల్లంపల్లి మాత్రం తనకు అక్కడ సీటు వద్దంటున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి సాయంత్రం సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

సెంట్రల్‌ ఇన్‌ఛార్జిగా వెల్లంపల్లి నియామకాన్ని మల్లాది అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. మల్లాదికే ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్‌తో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ భేటీకి కార్పొరేటర్లు, కన్వీనర్లు, గృహ సారథులు కూడా హాజరయ్యారు. ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి విష్ణును తప్పించడంపై నిరసన వ్యక్తం చేస్తూ సచివాలయ కన్వీనర్లు, కార్పొరేటర్లు, బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు, పార్టీ సమన్వయకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల్ని తిరిగి మల్లాది విష్ణుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణును తప్పించి వెల్లంపల్లికి ఎందుకు సీటిచ్చింది? విజయవాడ వెస్ట్‌లో ఉన్న వెల్లంపల్లిని సెంట్రల్‌కు ఎందుకు తీసుకొచ్చారు? సీటిచ్చినా వెల్లంపల్లి ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడేదే హాట్‌ టాపిక్‌గా మారింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×