BigTV English

Best Morning Habits: ఉదయాన్నే ఇలా చేయండి.. మీ లైఫ్ మారడం పక్కా!

Best Morning Habits: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. భోగభాగ్యాలకన్నా.. అష్ట ఐశ్వర్యాల కన్నా.. సిరిసంపదలు కన్నా.. ఆరోగ్యం ముఖ్యమైనది. అందుకోసం మంచి అలవాట్లు పాటిస్తూ.. దురలవాట్లకు దూరంగా ఉండాలి. మారుతున్న ఆహారపు అలవాట్లు, పనిఒత్తిడుల కారణంగా ఇటీవల కాలంలో వ్యాధులు పెరిగిపోతున్నాయి. 20 ఏళ్లకే కీళ్లనొప్పులు, గుండెపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

Best Morning Habits: ఉదయాన్నే ఇలా చేయండి.. మీ లైఫ్ మారడం పక్కా!

Best Morning Habits: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. భోగభాగ్యాలకన్నా.. అష్ట ఐశ్వర్యాల కన్నా.. సిరిసంపదలు కన్నా.. ఆరోగ్యం ముఖ్యమైనది. అందుకోసం మంచి అలవాట్లు పాటిస్తూ.. దురలవాట్లకు దూరంగా ఉండాలి. మారుతున్న ఆహారపు అలవాట్లు, పనిఒత్తిడుల కారణంగా ఇటీవల కాలంలో వ్యాధులు పెరిగిపోతున్నాయి. 20 ఏళ్లకే కీళ్లనొప్పులు, గుండెపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటిని తప్పించుకునేందుకు మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం మంచిది. రోజు ఉదయాన్నే కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


  • రోజూ ఉదయం ఒకే టైమ్‌కి నిద్ర లేవటం చాలా మంచిది. దీని వల్ల స్లీప్ క్వాలిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర 7,8 గంటలు ఉండేలా చూడాలి.
  • ఉదయాన్నే నిద్రలేవగానే ఓ గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం ఎంతో మంచి అలవాటు. ఇలా తాగడం వల్ల పేగుల్లోని టాక్సిన్స్‌ బయటకి వెళ్లిపోతాయి.
  • ప్రతి రోజు ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీర బరువును అదుపు చేయడంతో పాటు శక్తిని ఇస్తుంది.
  • నేడు చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించేందుకు కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనకి దూరంగా ఉంటారు. మానసిక సమస్యలు దూరమవుతాయి.
  • రోజు ఉదయాన్నే స్నానం చేయడం వల్ల బద్ధకం పోయి ఉత్సాహంగా ఉంటారు. అలా కాకుండా మరేదైనా సమయంలో స్నానం చేయడం వల్ల ఉదయం చేసినంత ప్రభావం చూపించదు. కాబట్టి స్నానాకి ఉదయమే బెస్ట్.
  • ఆరోగ్యానికి మనం ఉదయం తీసుకునే ఆహారమే మూలం. ప్రతి రోజు ఉదయం తీసుకునే ఆహారంలో ఓట్స్, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. వీటితో పాటు ఆహారంలో కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, మాంసకృతులు సమతులంగా ఉండటం అవసరం. రోజులో 4-5 లీటర్ల నీటిని తాగాలి.
  • మనం తీసుకునే ఆహారంలో కొవ్వు, నూనె పదార్థాలు బాగా తగ్గించాలి. మాంసాహారం మితంగా తీసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉండాలి. ప్యాకెట్లలో విక్రయించే పదార్థాలు, స్వీట్లుకు దూరంగా ఉండాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×