Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్టు మీ శత్రువులు ఎవరైనా ఉంటే వారికి మీ గురించి ఒక్క విషయం తెలిసేలా చేయాలట. అలాగే మీ గురించి మరే విషయం కూడా తెలియనివ్వకూడదట. ఇంతకీ చాణక్యుడు ఏం చెప్పాడు.. ఏ విషయం తెలిసేలా చేయాలి..? లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శత్రువులను ఎదుర్కోవడం విషయంలో చాణక్యుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది విచక్షణ, వ్యూహానికట. శత్రువు అంటే కేవలం బయట వ్యక్తి మాత్రమే కాదు, మన పురోగతికి అడ్డుపడే ప్రతికూల పరిస్థితులు లేదా మనలోని బలహీనతలు కూడా కావచ్చట. చాణక్య నీతి ప్రకారం శత్రువులను ఎదుర్కోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శత్రువును అర్థం చేసుకోవడం (Analysis): శత్రువు యొక్క బలా బలాలు అంచనా వేయడం.. ముందుగా శత్రువు ఎంత బలవంతుడో, అతని బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలట. తెలియకుండా యుద్ధానికి దిగడం అంటే ఓటమిని ఆహ్వానించడమే అవుతుందట.
కౌటిల్యం (Strategy): సత్రోర్ మిత్రం పరంబలం అంటే శత్రువు యొక్క మిత్రుడే మనకు మిత్రుడు కావచ్చు. శత్రువుల వర్గంలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారేమో చూసి, వారిని మన వైపు తిప్పుకోవడం తెలివైన పనిగా చాణక్యుడు సూచించాడట.
సామ, దాన, భేద, దండోపాయాలు: శత్రువులను ఎదుర్కోవడానికి చాణక్యుడు నాలుగు మార్గాలను సూచించాడట. అందులో మొదటిది సామ అంటే మచ్చిక చేసుకోవడం లేదా మంచి మాటలతో సమస్యను పరిష్కరించడం. రెండోది దాన అంటే కానుకలు లేదా ప్రయోజనాల ద్వారా శత్రువును శాంతింపజేయడం. మూడవది భేద అంటే శత్రువుల మధ్య విభేదాలను సృష్టించి వారి ఐక్యతను దెబ్బతీయడం. నాలుగవది దండ అంటే పై మూడు మార్గాలు విఫలమైనప్పుడు మాత్రమే శక్తిని (బలాన్ని) ఉపయోగించాలట.
అప్రమత్తత మరియు జాగ్రత్తలు: శత్రువు ఎప్పుడు, ఎలా దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా (Alert) ఉండాలట. గొంతులో విషం, నోటిలో అమృతం అన్నట్టు వ్యవహరించాలట. శత్రువు ఎదుట ఉన్నప్పుడు మీ అసలు ఉద్దేశాలను బయట పెట్టకూడదట. . పైకి మృదువుగా ఉన్నా, లోపల దృఢంగా ఉండాలట. శత్రువు అస్త్రాల కంటే అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం పెద్ద విజయమట.
కొన్ని కీలక సూత్రాలు: ఒకసారి నమ్మకద్రోహం చేసిన శత్రువును మళ్లీ నమ్మడం ఆత్మహత్యతో సమానమట. పాలు తాగే పామును పెంచినా అది విషాన్ని వదలదట. అలాగే శత్రువు ముందు మీ భయాన్ని ఎప్పటికీ బయటపడనివ్వకూడదట. మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారని శత్రువుకు తెలిసేలా చేయాలట. కోపంతో వెంటనే స్పందించడం కంటే సరైన సమయం కోసం వేచి చూడటం వల్ల విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయట.
ఒక హెచ్చరిక: చాణక్యుడు చెప్పినట్లుగా శత్రువు కంటే, శత్రువు చేస్తున్న పనుల పట్ల జాగ్రత్త వహించాలట. అతిగా ద్వేషించడం వల్ల శత్రువు కంటే మనమే ఎక్కువ నష్టపోతామట. మన లక్ష్యం శత్రువును నాశనం చేయడం కంటే మన పురోగతికి అడ్డు లేకుండా చూసుకోవడమే కావాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.