E-Paper
Advertisement

Silver Rings: ఆ మూడు రాశుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెండి ఉంగరాలు, ఆభరణాలు ధరించకూడదట

Silver Rings: ఆ మూడు రాశుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెండి ఉంగరాలు, ఆభరణాలు ధరించకూడదట
Advertisement

Silver Rings: ఆ మూడు రాశుల్లో పుట్టిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో వెండితో చేసిన ఉంగరాలు కానీ అభరణాలు కానీ అసలు ధరించకూడదట. ధరిస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎందుకు ధరించకూడదో..? ఎవరు ధరించకూడదో..?  పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం లోహాలు మన శరీరంలోని శక్తిని, గ్రహగతులను ప్రభావితం చేస్తాయట. వెండిని సాధారణంగా చంద్రుడికి ప్రతీకగా భావిస్తారట. చంద్రుడు నీటి తత్వానికి సంబంధించిన గ్రహం కావడం వల్ల ప్రధానంగా మూడు రాశుల్లో జన్మించిన జాతకులు వెండిని ధరించకూడదట.

Advertisement

మేష రాశి (Aries):  ఈ రాశికి అధిపతి కుజుడు. ఇది అగ్ని తత్వానికి చెందిన రాశి అని పండితులు చెప్తున్నారు. అందుకే నీటితత్వం కలిగిన వెండిని అగ్నితత్వం కలిగిన రాశిలో జన్మించిన వ్యక్తులు ధరించకూడదట. అంటే మేష రాశిలో పుట్టిన ఎవరైనా వెండిన అసలు ధరించకూడదట.

సింహ రాశి (Leo): ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది కూడా అగ్ని తత్వ రాశి. సింహ రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెండిని ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశికి అధిపతి గురుడు. ఇది కూడా అగ్ని తత్వానికి చెందినదేనని చెప్తున్నారు పండితులు. ఈ ధనస్సు రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా వెండిని ధరించకూడదట.

ఈ మూడు రాశుల జాతకులు ఎందుకు వెండిని ధరించకూడదు: ఈ మూడు రాశులు  అగ్ని తత్వాన్ని (Fire Element) కలిగి ఉంటాయట. వెండి చంద్రుడికి సంబంధించినది కాబట్టి  నీటి తత్వాన్ని (Water Element) కలిగి ఉంటుందట. అగ్ని, నీరు పరస్పర విరుద్ధమైనవి కాబట్టి.. ఈ మూడు రాశుల వారు వెండి ధరించడం వల్ల వీరిలోని సహజమైన ఉత్సాహం, శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

గ్రహాల వైరుధ్యం: సింహ రాశి అధిపతి అయిన సూర్యుడికి వెండికి అధిపతి అయిన చంద్రుడికి వైరుధ్యం ఉంటుందట. దీనివల్ల మనశ్శాంతి తగ్గడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు కలగవచ్చట.

ఆర్థిక సమస్యలు: అగ్ని తత్వ రాశుల వారు వెండిని ధరిస్తే అనవసరమైన ఖర్చులు పెరగడం, ఆర్థికంగా ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు.

కెరీర్ & ఆరోగ్యం: అగ్నితత్వ రాశులు వారు నీటితత్వమైన వెండిని ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో  ధరించిన వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం.. అలాగే వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు వస్తాయని శాస్త్రం చెప్తుందని పండితులు సూచిస్తున్నారు.

అయితే కొన్ని చోట్ల వృషభ, మకర రాశుల వారికి కూడా వెండి అంతగా సరిపడదని చెప్తుంటారట. ఇది కేవలం సాధారణ జ్యోతిష్య అంచనా మాత్రమేనని… మీ జాతకంలో చంద్రుడి స్థితి బాగుంటే ఏ రాశి వారైనా వెండిని ధరించవచ్చని, వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే కచ్చితంగా చెప్పవచ్చని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మొబైల్ నెంబర్ లో ఆ నెంబర్స్ ఉంటే అష్ట దరిద్రాలు మీ వెంటే  ఉంటాయట…?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×