E-Paper
Advertisement

Shivaratri: శివరాత్రి తర్వాత లక్ష్మీ నారాయణ యోగం – ఆ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనట

Shivaratri: శివరాత్రి తర్వాత లక్ష్మీ నారాయణ యోగం – ఆ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనట
Advertisement

Shivaratri: ఈ శివరాత్రి తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీ నారాయణ యోగం కలగనుంది. ఈ యోగంతో ఐదు రాశుల జాతకులకు అదృష్టయోగం కలనుందని పండితులు చెప్తున్నారు. వారు పట్టిందల్లా బంగారంలా మారినా ఆశ్చర్యపోవాలసిన అవసరం లేదంటున్నారు. ఇంతకీ రాజయోగం పట్టబోయే ఆ ఐదు రాశులేవో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం విశ్వంలో ఎప్పుడ ఏదో ఒక వింతలు విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు గ్రహ కూటమిలు ఏర్పడితే.. కొన్ని సార్లు యోగకాలం నడుస్తుంటుంది. అలా జరిగినప్పుడు కొన్ని రాశులకు మంచి జరిగితే కొందరికి బ్యాడ్‌ జరుగుతుంది. అయితే తాజాగా లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఐదు రాశుల వారికి రాజయోగం పట్టబోతుందని వారు పట్టిందల్లా బంగారం అవుతుందని..ఆయా రాశుల జాతకులు ఇన్నాళ్లు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లుకు గుడ్‌ బై చెప్పే రోజులు వచ్చేశాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:

Advertisement

లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఈ రాశి జాతకులకు అదృష్టం వరించబోతుందట. ప్రభుత్వ రంగం అధికారుల సహకారంతో కేరీర్‌లో ముందడుగు వేస్తారట. చాలా రోజులుగా నిలిచిపోయిన కఠిన పనులు పూర్తయ్యే అవకాశం ఉందట. ఆదాయం పెరిగడంతో పాటు ఇంతకు ముందు  కోల్పోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట. తండ్రి సలహా వల్ల  వీరి జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారట. వీరికి కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుందట.

వృషభ రాశి:

ఈ రాశి జాతకులకు కూడా లక్ష్మీ నారాయణ యోగం యోగించనుందట. వీరికి ఉద్యోగం, కేరీర్‌లో ఊహించని అవకాశాలు వస్తాయట. అకస్మాత్తుగా డబ్బు అందే యోగం ఉండటంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందట. సహోద్యోగుల మద్దతుతో ఆర్థిక ఒత్తిడి తగ్గడమే కాకుండా.. ముఖ్యమైన అతి కష్టమైన పని సులభంగా పూర్తవుతుందట. లోహ, వస్త్ర వ్యాపారులకు ప్రత్యేక లాభ సూచనలు ఉన్నాయట.  ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుందట.

కర్కాటక రాశి:

Advertisement

లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఈ రాశి జాతకులకు కూడా ఆత్మ విశ్వాసం బాగా పెరిగి ప్రభుత్వ కార్యాలయ పనుల్లో విజయాలు సాధిస్తారట. సీనియర్లు, సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుందట. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందట. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయట. కుటుంబంతో ఆనందంగా గడిపే సందర్భాలు పెరుగుతాయట.

కన్యా రాశి:

కన్యారాశి జాతకులకు లక్ష్మీ నారాయణ యోగం శుభకాలం తీసుకురానుందట. వీరికి మానసిక బలం పెరిగడంతో పాటు ఆఫీసుల్లో వీరి మాటకు ప్రత్యేకమైన విలువ పెరుగుతుందట. బ్యాంకింగ్‌, ఖాతా సంబంధిత పనుల్లో అదృష్టం పూర్తిగా సహకరిస్తుందట. తండ్రి వైపు నుంచి ఆర్థిక లేదా సలహా రూపంలో లాభ సూచనలు ఉన్నాయట. విద్య, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత స్పష్టంగా కనిపిస్తుందట. పిల్లల వల్ల ఆనందం, గర్వం కలుగుతుందట.

కుంభ రాశి:

లక్ష్మీ నారాయణ యోగ ప్రభావంతో ఈ రాశి వారికి ఆదాయం ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరుగుతుందట. కుటుంబంలో ప్రేమ, సామరస్యం, మరింత బలపడతాయట. ముఖ్యమైన ప్రణాళిక ఒక స్పష్టమైన దిశలో ముందుకు సాగుతుందట. వివాహ, ఆస్థి, వాహన యోగాలు బలపడతాయట. ఆనందకరమైన ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: అష్టాదశ శక్తిపీఠాలలో దాగి ఉన్న మిస్టరీ ఎంటో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×