E-Paper
Advertisement

Greatest business people: గొప్ప గొప్ప వ్యాపారవేత్తలంతా ఆ తేదీలోనే పుడతారట

Greatest business people: గొప్ప గొప్ప వ్యాపారవేత్తలంతా ఆ తేదీలోనే పుడతారట
Advertisement

Greatest business people: గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందిన వారంతా మాగ్జిమం ఆ తేదీలోనే పుట్టి ఉంటారట. ఆ తేదీలో పుట్టిన వారికి వ్యాపారం చేయడం ఒక కళగా పుట్టకతోనే వస్తుందట. అయితే ఆ తేదీ ఏంటి..? ఆ తేదీలో పుట్టిన వారి మిగతా ఆసక్తికరమైన విషయాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా  సరే 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ (Mercury) ప్రభావం ఉంటుందట. బుధుడు తెలివితేటలకు కమ్యూనికేషన్స్ కు, వ్యాపారానికి కారకుడట. అందుకే ఆయా తేదీల్లో పుట్టిన వారు చాలా చురుకుగా ఉండమే కాకుండా వారి జీవితంపై ఒక స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉంటారట.

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: ఐదవ నెంబర్‌లో పుట్టిన వ్యక్తులు చురుకైన తెలివితేటలు కలిగి ఉంటారట. వీరు చాలా వేగంగా ఆలోచిస్తారట. ఏదైనా సమస్య వస్తే దానికి తక్షణమే పరిష్కారం కనుగొనే నేర్పు వీరి సొంతమట. అయితే వీరు ఒకే చోట నిలకడగా ఉండటానికి ఇష్టపడరట. నిరంతరం కొత్త విషయాలను అన్వేషించడం, ప్రయాణాలు చేయడం వీరికి చాలా ఇష్టమట. ఇంకా ఐదవ తేదీలో పుట్టిన వాళ్లు ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతారట. వీరి మాట తీరు ఎదుటివారిని సులభంగా ఆకర్షిస్తుందట. వీళ్లు ఎప్పటికప్పుడు జీవితంలో మార్పును కోరుకుంటారట. ఒకే రకమైన రొటీన్ పనులను వీరు భరించలేరట. ఎప్పుడూ ఏదో ఒక మార్పును, కొత్తదనాన్ని కోరుకుంటారట.

కెరీర్ మరియు భవిష్యత్తు: సంఖ్యా శాస్త్రం ప్రకారం 5వ తేదీన పుట్టిన వారు పుట్టుకతోనే మంచి వ్యాపారవేత్తల లక్షణాలు కలిగి ఉంటారట.  రిస్క్ తీసుకోవడానికి వీరు వెనుకాడరట. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, మార్కెటింగ్ రంగాల్లో వీరు బాగా రాణిస్తారట. ఇంకా జర్నలిజం, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ సాఫ్ట్‌వేర్ రంగాల్లో కూడా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందట. వీరు డబ్బు సంపాదించడంలో కూడా చాలా నేర్పరులట. అయితే సంపాదించినంత వేగంగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

సామాజిక మరియు కుటుంబ జీవితం: ఐదవ నెంబర్‌లో పుట్టిన వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా మంచి పేరు సంపాదిస్తారట. స్నేహితుల సర్కిల్ చాలా పెద్దదిగా ఉంటుందట. వీరికి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగితే సహించరట.

ఐదవ నెంబర్‌ లో పుట్టిన వారు తీసుకోవాలసిన జాగ్రత్తలు: ఈ జాతకులు ఒక పని పూర్తి చేయకుండానే మరో పనిలోకి దూకడం వీరిలో కనిపించే ప్రధాన లోపమట. ఏదైనా ఒక లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే అద్భుతాలు సృష్టిస్తారట. అతిగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురవుతారట. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఓపికగా ఆలోచించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఆ నియమాలు తప్పకుండా పాటించాలట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×