E-Paper
Advertisement

Tirumala steps: తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఆ నియమాలు తప్పకుండా పాటించాలట

Tirumala steps: తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఆ నియమాలు తప్పకుండా పాటించాలట

Tirumala steps: తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారా..? అయితే మెట్ల మార్గంలో కొన్ని నియమాలు పాటించాలట. ఆలా నియమాలు పాటించకుండా కొండ మీదకు వెళ్లినా మీకు రావాల్సిన పుణ్యం రాకపోగా తప్పు చేసిన కర్మ చుట్టుకుంటుందట. ఇంతకీ ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..?

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలా స్వామి దర్శనానికి వెళ్లే వారు అలిపిరి మెట్ల మార్గంలో కానీ శ్రీవారి మెట్టు మార్గంలో కానీ కాలినడకన నడుచుకుంటూ వెళ్తుంటారు. అయితే అలా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలట. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవిత్ర భావంతో ప్రారంభించాలి: తిరుమలకు అలిపిరి నుంచి కానీ శ్రీవారి మెట్టు నుంచి కానీ మెట్లు ఎక్కడం ప్రారంభించే ముందు ఒక వ్రతంలా భావించాలట. మొదటగా స్వామివారిన మనసారా స్మరిస్తూ.. గోవిందా నామస్మరణ చేస్తూ.. మెట్లు ఎక్కడం ప్రారంభించాలట. వీలైతే మెట్లు ఎక్కడం మొదలు పెట్టడానికి ముందు కర్పూరం వెలిగించాలట.

మెట్ల మార్గంలో చెప్పులు ధరించకూడదు:  శ్రీవారి మెట్టు లేదా అలిపిరి నుంచి మెట్లు ఎక్కేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పులు ధరించకూడదట. చెప్పులు ధరించడం వల్ల పవిత్ర దెబ్బతింటుందట.

మద్యపానం / మాంసాహారం చేయకూడదు: స్వామి దర్శనానికి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్నప్పుడు మధ్యపానం సేవించడం కానీ మాంసాహారం భుజించడం కానీ చేయకూడదట. అలాగే దూమపానం కూడా చేయకూడదట.

కోపం లేదా తగాదాలు చేయకూడదు: శ్రీవారి దర్శనానికి వెళ్లడం అంటే పవిత్ర కార్యం లాంటిది కాబట్టి మార్గమధ్యలో ఎవరితోనే తగాదాలు పెట్టుకోకూడదు.. ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు.

ప్రతి మెట్టుకు నమస్కారం చేయడం: మెట్ల మార్గంలో స్వామి దర్శనం కోసం వెళ్తున్న సమయంలో ప్రతి మెట్టు కూడా పవిత్రమైనదిగా బావించి నమస్కారం చేసుకుంటూ వెళ్లాలట.

మెట్లపై చెత్త వేయకూడదు: శ్రీవారి దర్శనానికి వెళ్తూ మెట్ల మీద చెత్ వేయకూడదని చెప్తుంటారు. అయితే మెట్ల మీదనే కాదు.. తిరుమల గిరుల్లో సాక్ష్యాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తిరుగుతుంటారు.. కాబట్టి  ఎక్కడా కూడా అడ్డదిడ్డంగా చెత్తను వేయకూడదు.

దేవతల విగ్రహాల వద్ద నమస్కారం చేయాలి: తిరుమల మెట్లు ఎక్కే మార్గంలో చిన్న దేవాలయాలు ఉంటాయి. అవన్నీ ఎంతో మంది మహానుభావులు ప్రతిష్టించిన దేవతా విగ్రహాలు అందువల్ల ప్రతి విగ్రహం దగ్గర నమస్కారం చేసుకుని యాత్రను కొనసాగించాలి.

శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి: మెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధ్యలో కచ్చితంగా  విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లు తాగుతుండాలి. గాబరాగా వెళ్లకూడదు.

గోవిందా నామ జపం చేస్తుండాలి: మెట్లు ఎక్కేటప్పుడు గోవిందా గోవిందా అంటూ స్వామి వారి నామ జనం చేస్తూ వెళ్లాలి. అంతే కానీ ఎవ్వరితోనూ అనవసరంగా మాట్లాడకూడదు.

ఈ నియమాలు పాటిస్తూ కొండ మీదకు చేరుకున్న తర్వాత భక్తులు ముందుగా స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేసి.. ముందుగా భూ వరాహస్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లడం సంప్రదాయంగా చెప్తున్నారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పరాభవ నామ సంవత్సర (2026-27) ఉగాది పంచాంగం 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×