E-Paper
Advertisement

Nails Cutting: గోర్లు ఎప్పుడంటే అప్పుడు కట్ చేస్తున్నారా..? ఆ తప్పు అసలు చేయకండి

Nails Cutting: గోర్లు ఎప్పుడంటే అప్పుడు కట్ చేస్తున్నారా..? ఆ తప్పు అసలు చేయకండి
Advertisement

Nails Cutting: చాలా మంది ఎప్పుడంటే అప్పుడు గోర్లు కట్‌ చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల దోషాలు అంటుకుంటాయని.. మనుషులకు లేనిపోని నెగెటివ్‌ ఎనర్జీ వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. గోర్లే కదా కట్‌ చేస్తే ఏమౌతుదిలే అనుకుంటుంటారు కొంత మంది.. హిందూ శాస్త్రాల ప్రకారం గోర్లు కట్‌ చేయడానికి కూడా అనువైన రోజులు ఉన్నాయట. రోజులే కాదు గోర్లు కట్‌ చేయడానికి అనువైన సమయం కూడా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే గోర్లు ఎప్పుడు ఏ రోజు ఏ సమయానికి కట్‌ చేయాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ పరిహారశాస్త్రం ప్రకారం గోర్లు కట్‌ చేయడం అనేది కూడా ఒక పద్దతితో చేయాల్సిన పని అంటున్నారు పండితులు. గోర్లు ఎప్పుడంటే అప్పుడు కట్‌ చేసే వారికి వెంటనే నెగెటివ్‌ ఎనర్జీ అనేది వస్తుందని.. దాని వల్ల మనుషుల జీవితాలే తలకిందులు అవుతాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వారంలో కొన్ని రోజులు గోర్లు కట్‌ చేయడం అనేది అశుభ సూచకంగా కూడా భావించాలట. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కట్‌ చేస్తే.. ఆర్థికపరమై, సామాజికి పరమైన, శారీరక పరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇంకా కుంటుంబంలో సంతోషం అనేదే లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

సోమవారం: సోమవారం గోర్లు కట్‌ చేయడం వల్ల మంచే జరుగుతుందట. సోమవారాకి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనః కారకుడు కాబట్టి ఈరోజు గోర్లు కట్‌ చేయడం వల్ల మానసిక ఆలసట తగ్గి  మనస్సు ప్రశాంతం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మానసిక శుద్ది కలుగుతుందట.

మంగళవారం: మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్లు కట్‌ చేయకూడదట. ఈ రోజున గోర్లు కత్తిరించచడం వల్ల ఆ వ్యక్తి అనవసరంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట.. ఆర్థిక పరమైన ఒత్తిళ్లు పెరుగుతాయట.

Advertisement

బుధవారం: బుధవారం గోర్లు కత్తిరిస్తే చాలా శుభాలు జరుగుతాయట. గోర్లు కట్‌ చేయడానికి అనువైన రోజు బుధవారమే అని పండితులు సూచిస్తున్నారు. బుధవారం గోర్లు కట్‌ చేయడం వల్ల బుద్ది చురుకుదనం పెరుగుతుందట. అలాగే అకస్మిక ధనలాభం కలుగుతుందట.

గురువారం: గురువారం బృహస్పతికి అంకితమైన రోజు ఈ రోజు గోర్లు కత్తిరించకపోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. బృహస్పతి అంటే గురుగ్రహం. అందుకే ఈ రోజు గోర్లు కట్‌ చేసిన వారికి విద్యలో ఇబ్బందులు వస్తాయని.. అనుకున్న పనులు వాయిదా పడతాయని హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం: ఈ రోజున గోర్లు కత్తిరించకూడదనే నమ్మకం ఎక్కువగా ఉంటుందట. శుక్రవారం గోర్లు కట్‌ చేస్తే..  కుబుంబంలో అశాంతి నెలకొంటుందట. ఇంట్లో కుటుంబ సభ్యులు మధ్య రిలేషన్స్‌  దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు పండితులు.

శనివారం: శనివారం గోర్లు కత్తిరించకూడదని ఎవరైనా తెలియక కట్‌ చేస్తే..  శనిదోషం అంటుంకుంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే శనివారం గోర్లు కట్‌ చేయడం వల్ల శారీరక అలసట  పెరుగుతుందట.

ఆదివారం: ఆదివారం కూడా గోర్లు ఎట్టి పరిస్థితుల్లో కట్‌ చేయకూడదట. ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు గోర్లు కట్‌ చేయడం వల్ల సూర్యుడి అగ్రహానికి గురవుతారని దీంతో తండ్రి కొడుకుల మధ్య గొడవలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

గోర్లు తీయడానికి వారంతో పాటు సమయం కూడా ముఖ్యమేనట. ఎట్టి పరిస్థితుల్లో గోర్లు సాయంత్రం కానీ రాత్రి పూట కానీ కట్‌ చేయకూడదని పండితులు చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ధనస్సు రాశికి కలలు నెరవేరే టైం వచ్చింది.

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×