E-Paper
Advertisement

Medchal Water: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!

Medchal Water: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!
Advertisement

Medchal Water: మేడ్చల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నాయకుల ధర్నాపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు.

రాజకీయ నాటకమని విమర్శ

Advertisement

రెండు డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ మేడ్చల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా కేవలం ఒక రాజకీయ నాటకమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని వారు విమర్శించారు.

ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఆరోపణలు

Advertisement

ఎన్నికల సమయంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని గొప్పలు చెప్పుకుని ఓట్లు దక్కించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి, గెలిచిన తర్వాత మేడ్చల్ ప్రజల నీటి కష్టాలను గాలికొదిలేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తన స్వంత కాలేజీలకు నీటిని తరలించుకుంటున్న ఎమ్మెల్యే, సామాన్య ప్రజల తాగునీటి అవసరాలను పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.

నిర్లక్ష్యంపై ఆగ్రహం

నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పటికీ, ట్యాంకర్ల ద్వారా కనీసం నీటిని సరఫరా చేయడానికి కూడా ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల సమస్యలను రాజకీయ అజెండాగా మార్చి చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

శాశ్వత పరిష్కారానికి హామీ

ఆధారం లేని ఆరోపణలు మానుకోవాలని హితవు పలికిన కాంగ్రెస్ నాయకులు, తాము ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తక్షణమే ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఘనపూర్ ప్రాజెక్ట్ ద్వారా మేడ్చల్‌కు అధిక శాతం నీరు వచ్చేలా చేసి, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రమణ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మాజీ కౌన్సిలర్ చాప రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు బాలమల్లేష్, రామన్నగారి రాఘవేందర్ గౌడ్, మధుకర్ యాదవ్, రామస్వామి, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్, ఆకాష్, రఘుపతి రెడ్డి, వరద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×