Debt: ఆ తేదీలో పుట్టిన వారికే ఎక్కువగా అప్పులు అవుతుంటాయట. వారికే చీటికి మాటికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుంటాయట. ఎంత సంపాదించినా రూపాయి నిలవక ఇబ్బందులు పడేది కూడా ఆ తేదీలో పుట్టిన వాళ్లేనట. ఇంతకీ ఆ తేదీ ఏంటి..? వాళ్లకు ఎందుకు అప్పులు అవుతుంటాయి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతుందని పండితులు చెప్తున్నారు. కొన్ని ప్రత్యేక సంఖ్యల ప్రభావం వల్ల వ్యక్తులు ఖర్చుల విషయంలో నియంత్రణ కోల్పోవడం లేదా అనుకోని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయట. ముఖ్యంగా ఈ క్రింది తేదీల్లో పుట్టిన వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సంఖ్యాశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
8వ సంఖ్య జాతకులు: న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలల్లో పుట్టిన వారందరూ 8వ సంఖ్యా జాతకుల కిందకే వస్తారట. వీరి మీద శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. వీరు కష్టపడి బాగా సంపాదిస్తారట కానీ, వ్యాపారాల్లో వచ్చే ఆకస్మిక నష్టాలు లేదా కోర్టు వ్యవహారాల వల్ల వీళ్లు అప్పులు చేయాల్సి వస్తుందట. అందుకే వీరికి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అని పండితులు సూచిస్తున్నారు.
4వ సంఖ్య జాతకులు: సంఖ్యాశాస్త్రం ప్రకకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారందరూ 4వ సంఖ్యా జాతకులేనట. వీరికి రాహు గ్రహ ప్రభావం ఉంటుందట. వీరు కొత్త విషయాల పట్ల ఆకర్షితులై, ఆలోచించకుండా చేసే భారీ పెట్టుబడులు లేదా విలాసాల కోసం చేసే ఖర్చులు వీరిని అప్పుల పాలు చేస్తాయట. అందుకే వీరు ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
9వ సంఖ్య జాతకులు: న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారందరూ 9వ సంఖ్య జాతకులట. వీరిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుందట. వీరు కొంచెం మొండిగా లేదా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటారట. ఇతరులకు హామీ (Guarantor) ఉండటం వల్ల లేదా ఆస్తుల విషయంలో గొడవల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆయా విషయాల్లో ఈ సంఖ్యా జాతకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
7వ సంఖ్యా జాతకులు: న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారందరూ 7వ సంఖ్యా జాతకులు అవుతారట. వీరు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉంటారట. ఒక్కోసారి ప్రాపంచిక విషయాల మీద, డబ్బు సేవింగ్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల తెలియకుండానే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారట.
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి సూచనలు: ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందట. అలాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం నాడు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.