E-Paper
Advertisement

సోమవారం ఆ పనులు అసలు చేయకూడదట – ఏంటో తెలుసా..?

సోమవారం ఆ పనులు అసలు చేయకూడదట – ఏంటో తెలుసా..?
Advertisement

Monday: సోమవారం ఆ పనులు అసలు చేయకూడదట. తెలిసి చేసినా తెలియక చేసినా ఇబ్బందులు పడతారట. అయితే సోమవారం ఏ పనులు చేయకూడదదో… ఎందుకు చేయకూడదో..? చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటో..? ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం మరియు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం సోమవారం చంద్రుడికి, పరమశివుడికి  అత్యంత ప్రీతికరమైన రోజట. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని, కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పండతులు సూచిస్తున్నారు. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సోమవారం కచ్చితంగా చేయాల్సిన పనులు: సోమవారం ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్లడం లేదా ఇంట్లోనే శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిదట. శివ పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ  మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభించడమే కాకుండా మీకున్న కష్టాలు తీరిపోతాయట. ఇంకా సోమవారం రోజు చంద్రుడి అనుగ్రహం కోసం పాలు, పెరుగు, బియ్యం, పంచదార లేదా తెల్లని వస్త్రాలను పేదలకు దానం చేయాలట. అలాగే సోమవారం నాడు తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు సానుకూల శక్తి (Positive Energy) పెరుగుతుందట. ముఖ్యంగా సోమవారం రోజు దేవుడికి పూజ చేసిన తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల మీకు ఏవైనా చంద్ర దోషాలు ఉంటే పోతాయట. సోమవారం మనస్సుకు కారకుడైన చంద్రుని రోజు కాబట్టి కనీసం పావుగంటైనా ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందట.

సోమవారం చేయకూడని పనులు: ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు సోమవారం నాడు చేయకూడదట. అందులో మొదటిది పాలు లేదా తెల్లని వస్తువులను ఇతరులకు అమ్మకూడదట. అలాగే ఎవరికైనా ఉచితంగా కూడా ఇవ్వకూడదట. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కొలువైన లక్ష్మీదేవత బయటకు వెళ్లిపోతుందట. మరీ ముఖ్యంగా సాయంత్ర పూట అసలు ఇవ్వకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే సోమవారం రోజున తల్లితో గొడవ పడకూడదట. అలాగే స్త్రీలను మనస్తాపానికి గురిచేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలహీనపడతాడట. దీనివల్ల మీకు మానసిక అశాంతి కలుగుతుందట. సోమవారం నాడు అనవసరమైన కోపానికి తావివ్వకూడదట. చంద్రుడు చల్లదనానికి సంకేతం, కాబట్టి ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించాలట. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం నాడు ఉత్తర దిశగా ప్రయాణించడం అంత మంచిది కాదట. ఒకవేళ తప్పనిసరి అయితే, కొంచెం పెరుగు తినడం లేదా అద్దంలో ముఖం చూసుకుని బయలుదేరడం మంచిదట. ఇక ఆధ్యాత్మికంగా ఈ రోజు శివుడికి అంకితమైన రోజు కాబట్టి మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గుడ్లగూడ ఇంట్లోకి వస్తే అదృష్టమా..? అరిష్టమా..?

 

 

shouldn’t do those things on a Monday—do you know what they are?

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×