E-Paper
Advertisement

Vastu: వాస్తు ప్రకారం ఎలాంటి ఇంట్లో ఉంటే ధనవంతులు అవుతారో తెలుసా..?

Vastu: వాస్తు ప్రకారం ఎలాంటి ఇంట్లో ఉంటే ధనవంతులు అవుతారో తెలుసా..?
Advertisement

Vastu: వాస్తు శాస్త్ర ప్రకారం ఎలాంటి ఇంట్లో ఉంటే ధనవంతులు అవుతారో తెలుసా..? ఇంటి నిర్మాణ శైలిలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో తెలుసా..? ఫర్ఫెక్ట్‌ వాస్తుతో కట్టిన ఇల్లు మిమ్మల్ని అపర కుబేరుడిని చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నిర్మాణం మరియు అందులోని గదుల అమరిక కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని, ప్రశాంతతను ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణుల చెప్తుంటారు. అయితే ధనవంతులు కావడానికి లేదా ఆర్థికంగా స్థిరపడటానికి వాస్తులో కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయంటున్నారు.

Advertisement

ఇంటి ప్రవేశ ద్వారం (Main Entrance): ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తర లేదా ఈశాన్య (North-East) దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ దిశల నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందట. అలాగే ప్రవేశ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో నిండి ఉండాలట. ఇక్కడ ఎటువంటి అడ్డంకులు (చెత్త, చెప్పులు, ముళ్ల మొక్కలు) ఉండకూడదట.

ఈశాన్య దిశ (North-East – కుబేర స్థానం): ఇంటి ఈశాన్య భాగాన్ని ‘దేవతల మూల’గా పిలుస్తారు. ఇక్కడ పూజ గది ఉండటం అత్యంత శ్రేష్ఠం. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ చాలా తేలికగా, శుభ్రంగా ఉంచాలట. ఇక్కడ ఎటువంటి బరువైన సామాగ్రిని ఉంచకూడదట.

Advertisement

నైరుతి దిశ (South-West – ఆర్థిక స్థిరత్వం): నైరుతి దిశను ఆర్థిక స్థిరత్వానికి మూలంగా భావిస్తారు. ఇంటి యజమాని గది (Master Bedroom) ఈ దిశలో ఉండటం మంచిదట. మీ నగదు, విలువైన బంగారు ఆభరణాలు లేదా ముఖ్యమైన ఆర్థిక పత్రాలను ఈ గదిలో నైరుతి వైపు గోడకు ఆనుకుని ఉండే బీరువాలో దాచుకోవాలి. బీరువా తలుపు ఉత్తర దిశకు తెరుచుకుంటే, అది ధన వృద్ధికి సూచికగా భావిస్తారట.

ఆగ్నేయ దిశ (South-East – అగ్ని మూల): ఈ దిశలో వంటగది ఉండాలట. ఇక్కడ వంట చేసేటప్పుడు ముఖం తూర్పు దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, ఆర్థిక ప్రవాహాన్ని పెంచుతుందట.

వాయువ్య దిశ (North-West): ఇది అతిథుల గదికి లేదా నిల్వ ఉంచే గదికి అనువైనది. అయితే  ఈ దిశలో ఎప్పుడూ చెత్తా చెదారం పేరుకుపోకుండా చూసుకోవాలట లేదంటే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందట.

ఇంటి ఆకృతి (Shape of the House): ఇల్లు ఎప్పుడూ చతురస్రాకారంలో (Square) లేదా దీర్ఘచతురస్రాకారంలో (Rectangle) ఉండాలి. కోణాల వద్ద కత్తిరించబడినట్లుగా (Cut corners) ఉండకూడదు. ఇలా ఉంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయట.

 కొన్ని ముఖ్యమైన చిట్కాలు: ఇంట్లో కుళాయిలు లేదా పైపుల నుండి నీరు లీక్ అవ్వడం ఆర్థిక నష్టానికి సంకేతమట. ఇలాంటి సమస్యలను వెంటనే బాగు చేయించుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో తులసి మొక్కను ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెంచడం చాలా మంచిదట. మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఆగ్నేయ దిశలో పెంచితే ఆర్థికంగా బాగుంటుందట. ఉత్తర గోడపై అద్దాన్ని అమర్చడం వల్ల ధనం వృద్ధి చెందుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శ్రీరామనవమి జరుపుకోవడంలో ఉన్న అంతర్యం ఏమిటి

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×