E-Paper
Advertisement

Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్
Advertisement

Fans On Mohsin Naqvi:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. మరో 24 గంటల్లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 8 జట్ల కెప్టెన్ల సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా కెప్టెన్లు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీపై ( Mohsin Naqvi ) అక్కడి అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఈ టోర్నమెంట్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు మండిపడుతున్నారు. తమకు రిఫండ్ చేయాల్సిన డబ్బులను 72 గంటలు గడిచినా కూడా మొహ్సిన్ న‌ఖ్వీ విడుదల చేయలేదని సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన టికెట్ల రిఫండ్ డబ్బులు ( Tickets Refund) మొత్తం మొహ్సిన్ న‌ఖ్వీ తినేసాడని ఆరోపణలు చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను మొదటగా 6 నగరాలలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. అది కూడా ప్రేక్షకుల సమక్షంలోనే ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన కొన్ని టికెట్లను కూడా విక్రయించారు. దీంతో పాకిస్తాన్ అభిమానులు, విదేశీయులందరూ టికెట్లను కొనుగోలు చేశారు. అయితే పచ్చిమాసియాలో యుద్ధం, తాలిబన్ల నుంచి వార్నింగులు, ఇటు చమురు కొరత ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) 72 గంటల కిందట ప్రకటన చేశాడు.

అంతేకాదు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు రిఫండ్ డబ్బులు ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. దానికి 72 గంటల సమయాన్ని కూడా పెట్టారు. అయితే మొహ్సిన్ న‌ఖ్వీ చేసిన ఈ ప్రకటనకు 72 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా చాలా మంది అభిమానులకు టికెట్ల రిఫండ్ డబ్బులు పడలేదు. దీంతో పాకిస్తాన్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. రిఫండ్ డబ్బులు మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ తినేసాడని ఆరోపణలు చేస్తున్నారు. ఆ డబ్బులు తిన్నాడు కాబట్టే.. తమకు ఇవ్వడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లుగా మొహ్సిన్ న‌ఖ్వీ పనితీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రేక్షకులు లేకుండానే ఈసారి జరగనుంది. కరాచీ అలాగే లాహోర్ వేదికగా ఈ టోర్నమెంట్ మొత్తాన్ని నిర్వహిస్తారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహిస్తే ఎవడు చూడనని అంటున్నారు.

Advertisement

 

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×