Numerology: న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి ఆర్థిక స్థితిగతులు మరియు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెప్తుంటారు. ఏదో ఒక తేదీన పుట్టినంత మాత్రాన అందరూ కోటీశ్వరులు కాలేరని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు ధన సంపాదనకు, వ్యాపార నైపుణ్యానికి, అదృష్టానికి అనుకూలంగా ఉంటాయని సంఖ్యా శాస్త్రం చెబుతుందట. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన వారు ఎప్పటికైనా కోటీశ్వరులు అవుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
8వ సంఖ్యలో పుట్టిన వాళ్లు (పుట్టిన తేదీలు: 8, 17, 26): న్యూమరాలజీలో 8వ సంఖ్యను సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శని ప్రభావిత సంఖ్య. ఈ తేదీల్లో ( 8, 17, 26) పుట్టిన వారు ప్రారంభంలో చాలా కష్టపడాల్సి వచ్చినా, 35 ఏళ్ల తర్వాత వారి జీవితం అద్భుతంగా మారుతుందని, స్థిరమైన సంపదను పొందుతారని చెబుతారని న్యూమరాలజిస్టులు చెప్తున్నారు.
1వ సంఖ్యలో పుట్టి వాళ్లు (పుట్టిన తేదీలు: 1, 10, 19, 28): ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. ఈ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారట. వీరికి ధనం, కీర్తి, గౌరవం సహజంగానే లభిస్తాయట. ముఖ్యంగా 28వ తేదీన పుట్టిన వారు అపారమైన సంపదను పొందే అవకాశం ఉందని న్యూమరాలజిస్టులు చెప్తున్నారు.
5వ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు (పుట్టిన తేదీలు: 5, 14, 23): ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. ఈ ఐదవ సంఖ్యలో పుట్టిన వారు అత్యంత తెలివైన వారుగా ఉంటారు. వీరు వ్యాపార రంగంలో రాణిస్తారు. సమస్యలను పరిష్కరించడంలోనూ, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వీరు సిద్ధహస్తులు. ఈ తెలివితేటలే వారిని ధనవంతులుగా మారుస్తాయట.
4వ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు (పుట్టిన తేదీలు: 4, 13, 22, 31): ఈ సంఖ్యకు అధిపతి రాహువు. వీరు క్రమశిక్షణకు, కఠిన శ్రమకు మారుపేరు. వ్యూహరచన చేయడంలో వీరు దిట్ట. సరైన ప్రణాళికతో వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారట.
6వ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు (పుట్టిన తేదీలు: 6, 15, 24): ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు ఐశ్వర్యానికి, సుఖసంతోషాలకు కారకుడు. అందుకే ఈ సంఖ్య గలవారికి లగ్జరీ జీవితం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని న్యూమరాలజిస్టులు చెప్తుంటారు.
9వ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు (పుట్టిన తేదీలు: 9, 18, 27): ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. ఈ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు యోధుల వంటి వారు. పట్టుదల, ధైర్యంతో కూడిన వ్యాపారాలు చేసి విజయం సాధిస్తారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.