E-Paper
Advertisement

Trustworthy People: ఏ తేదీల్లో పుట్టిన వారు అత్యంత నమ్మకంగా ఉంటారో తెలుసా..

Trustworthy People: ఏ తేదీల్లో పుట్టిన వారు అత్యంత నమ్మకంగా ఉంటారో తెలుసా..
Advertisement

Trustworthy People: ఏ తేదీల్లో పుట్టిన వారు అత్యంత నమ్మకంగా ఉంటారో తెలుసా..? నమ్ముకున్న వ్యక్తుల కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారట. తమను నమ్ముకున్న వాళ్లు ఎంతటి దీనావస్థలో ఉన్నా వదిలేసి అసలు వెళ్లరట.

సంఖ్యాశాస్త్రం (Numerology) మరియు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తనపై అతని పుట్టిన తేదీ ప్రభావం చూపిస్తుందట. ముఖ్యంగా  నమ్మకానికి, నిలకడకు, బాధ్యతకు  పేరుగాంచిన వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు  ఆ తేదీల్లోనే పుడతారట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నాలుగవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంగా నాలుగవ తేదీ జాతకులు అవుతారట. ఈ తేదీల్లో పుట్టిన వారు రాహువు ప్రభావం కలిగి ఉంటారట. అందుకే వీరు చాలా క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారట.

నాలుగవ తేదీ వాళ్లు ఎందుకు నమ్మకస్తులు:  వీరు ఒకసారి మాట ఇస్తే వెనక్కి తగ్గరట. స్నేహానికైనా, ప్రేమకైనా ప్రాణమిచ్చే స్వభావం వీరిదట. వీరు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట అలాగే రహస్యాలను బాగా దాచగలరట.

Advertisement

ఎనిమిద తేదీ జాతకులు: ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా ఎనిమిద తేదీ జాతకులు అవుతారట. ఈ తేదీల్లో పుట్టిన వారు శని గ్రహ ప్రభావం కలిగి ఉంటారట. వీరు నెమ్మదిగా ఉన్నప్పటికీ, చాలా లోతైన వ్యక్తిత్వం కలిగి ఉంటారట. బాధ్యతలను స్వీకరించడంలో వీరికి వీరే సాటి. వీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారట. సంబంధాలలో అత్యంత విశ్వసనీయతను ప్రదర్శిస్తారట.

రెండవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా రెండవ తేదీ జాతకులు అవుతారట. వీరు చంద్రుని ప్రభావం కలిగి ఉంటారట. వీరు చాలా సున్నిత మనస్కులు మరియు భావోద్వేగపూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారట. అవతలి వారిని బాధపెట్టడం వీరికి ఇష్టం ఉండదట. మోసం చేయడం వీరి రక్తం లోనే ఉండదట. భాగస్వామికి లేదా స్నేహితులకు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తారట.

ఆరవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా ఆరవ తేదీ జాతకులు అవుతారట. ఈ తేదీల్లో పుట్టిన వారి మీద శుక్రుని ప్రభావం ఉంటుందట. వీరు కుటుంబానికి మరియు బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారట. వీరు శాంతి ప్రియులు. తమ చుట్టూ ఉన్న వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారట.. అందుకే వీరు ఎవరి నమ్మకాన్ని అంత సులభంగా వమ్ము చేయరట.

ఇంకా కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మొడితనం ఉన్నా వాళ్లు నమ్మకంగానే ఉంటారట. వారిలో 1, 10, 19, 28 (సంఖ్య 1) తేదీల్లో పుట్టిన వారు కూడా చాలా నమ్మకస్తులేనట కానీ వారిలో నాయకత్వ లక్షణాలు, కొంచెం అహం (Ego) ఎక్కువగా ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇక 5, 14, 23 (సంఖ్య 5) తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారు, కానీ పరిస్థితులకు తగ్గట్లుగా మారుతుంటారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: రాత్రి సమయంలో భార్యభర్తలు ఎట్టి పరిస్థితుల్లో అలా నిద్రించకూడదట…?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×