E-Paper
Advertisement

Ego people: ఏ రాశిలో పుట్టిన వారికి ఎక్కువ అహంభావం ఉంటుందో తెలుసా

Ego people: ఏ రాశిలో పుట్టిన వారికి ఎక్కువ అహంభావం ఉంటుందో తెలుసా
Advertisement

Ego people: ఏ రాశిలో పుట్టిన వారికి ఎక్కువ అహంభావం ఉంటుందో తెలుసా..? వారికున్న ఈగో లేదా అహంభావం వల్ల వాళ్లు ఏం నష్టపోతారో తెలుసా..? ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు పుట్టించుకునే వారంతా ఇదే బాపతు అంటూ పండితులు చెప్తున్నారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తిలోని ఆత్మవిశ్వాసం ఒక్కోసారి అహంకారంగా కనిపించవచ్చట. ఇది వారి రాశి చక్రం ఆ రాశికి అధిపతి అయిన గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుందట. ఏ రాశి వారికి అహంభావం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సింహ రాశి (Leo): ఈ రాశికి అధిపతి సూర్యుడు (గ్రహాల రాజు). రాజుకు ఉండే సహజమైన గర్వం వీరిలో ఉంటుందట. తాము ఎక్కడున్నా అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారట. ఎవరైనా తమను తక్కువ చేసి చూస్తే అస్సలు సహించలేరట. వీరి ఆత్మగౌరవం ఒక్కోసారి అహంభావంగా మారిపోతుందట.

మేష రాశి (Aries)( మొండితనం): మేష రాశికి అధిపతి కుజుడు. అగ్ని తత్వ రాశి కావడం వల్ల వీరు చాలా వేగంగా స్పందిస్తారట. నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణి వీరిలో ఉంటుందట. వేరొకరి కింద పని చేయడం లేదా ఎవరైనా సలహా ఇస్తే వినడం వీరికి కొంచెం కష్టమైన పనట. వీరి ధైర్యం ఒక్కోసారి మొండితనంగా, అహంకారంగా మారుతుందట.

Advertisement

వృశ్చిక రాశి (Scorpio) – అంతర్గత అహం: ఈ రాశి వారు బయటికి చాలా గంభీరంగా కనిపిస్తారట. కానీ లోపల చాలా దృఢమైన అహం కలిగి ఉంటారట. ఎవరైనా తమను విమర్శిస్తే వీరు అస్సలు మర్చిపోరట. తమ వ్యక్తిత్వాన్ని లేదా రహస్యాలను ఎవరైనా కెలికితే వీరిలోని అహం పడగ విప్పుతుందట.

మకర రాశి (Capricorn) – అధికార గర్వం: మకర రాశిలో పుట్టిన వారికి అహంభావం తెలివితేటలతో కూడి ఉంటుందట. తాము అందరికంటే ఎక్కువ కష్టపడతామని తామే గొప్ప విజేతలమని భావిస్తారట. తక్కువ స్థాయిలో ఉన్న వారిని లేదా సోమరిపోతులను వీరు గౌరవించరట.. ఇది ఎదుటివారికి అహంకారంగా అనిపించవచ్చని పండితులు సూచిస్తున్నారు.

ధనుస్సు రాశి (Sagittarius) – జ్ఞాన అహం: ధనస్సు రాశిలో పుట్టిన వారు తామే మేధావులమని, అన్నీ తమకే తెలుసనే గర్వం పడుతుంటారట. ఎక్కడైనా బృంద చర్చల్లో తాము ఓడిపోవడానికి ఇష్టపడరట. తమ సిద్ధాంతాలే సరైనవని వాదిస్తారట.

వృషభ రాశి (Taurus) – స్థిరమైన అహం: ఈ వృషభ రాశిలో పుట్టిన వారు చాలా మొండిగా ప్రవర్తిస్తారట. వీళ్లు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచం తలకిందులైనా తమ నిర్ణయాన్ని  మార్చుకోరట. వీరి ఈ పట్టుదలే అందరికీ అహంభావంగా కనిపిస్తుందట.

అహంభావం తక్కువగా ఉండే రాశులు

కర్కాటకం (Cancer): ఈ రాశిలో పుట్టిన వారు చాలా సున్నిత మనస్కులట. ఇతరులను బాధపెట్టడం వీరికి ఇష్టం ఉండదట.

మీనం (Pisces): మీన రాశిలో పుట్టిన జాతకులు అసలు స్వార్థం లేని వారట. వీరికి అహంకారం కంటే దయాగుణం ఎక్కువగా ఉంటుందట.

కన్య (Virgo): కన్యా రాశిలో పుట్టిన వారు కూడా చాలా సౌమ్యంగా ఉంటారట. వీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట.

తుల (Libra): తులా రాశిలో పుట్టిన వారు  అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటారట..  కాబట్టి వీరికి అహం చాలా తక్కువగా ఉంటుందట.

మిథునం (Gemini): మిథునంలో పుట్టిన వారు చాలా కూల్‌ పర్సన్స్‌ అట. వీరు  పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతుంటారట.

కుంభం (Aquarius): కుంభ రాశి జాతకులు కూడా అందరూ బాగుండాలని కోరుకునే సామాజిక దృక్పథం కలవారట. అందుకే వీరిలో అహం అసలు కనిపించదట.

ఇక మనిషిలో అహంభావం అనేది కేవలం రాశి మీదనే కాకుండా, జాతక చక్రంలోని  లగ్నం, రవి (సూర్యుడు) ఉన్న స్థితిపై ఆధారపడి ఉంటుందట. అందరిలోనూ అహం ఉంటుంది.. కానీ అది ఎదుటివారిని తక్కువ చేసేలా ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపపు వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుందో తెలుసా… ?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×