E-Paper
Advertisement

Things to avoid: పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఆ వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదట

Things to avoid: పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఆ వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదట
Advertisement

Things to avoid: పుట్టింటి నుంచి అమ్మాయిలు ఆ వస్తువులు అసలు తీసుకెళ్లకూడదట. అలా తీసుకెళ్తే చాలా సార్లు అది పుట్టింటికే అరిష్టమని పండితులు చెప్తున్నారు. మరికొన్ని సార్లు కొన్ని వస్తువులు పట్టుకెళ్లడం వల్ల అత్తింటికి కూడా నష్టమేనట. ఇంతకీ అమ్మాయిలు పుట్టింటి నుంచి పట్టుకెళ్లకూడదని వస్తువులు ఏవీ.. అవి తీసుకెళ్లడం కలిగే అరిష్టాలే ఏవో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

సనాతన హిందూ ధర్మంలో ప్రతి మనిషి పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు చేయాల్సిన ప్రతి క్రియను క్షుణ్ణంగా పొందుపరిచారు పెద్దలు. అలాగే పెళ్లైన అమ్మాయిలు తమ పుట్టింటి నుంచి అత్తింటికి ఏ వస్తువులు పట్టుకెళ్లకూడదో కూడా వివరించారు. ఆ వస్తువులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చేట చీపురు: ఈ రెండు వస్తువులను అమ్మాయిలు పుట్టింటి నుంచి అత్తింటికి తెచ్చుకుంటే పుట్టింటికి చాలా అరిష్టం జరుగుతుందట. పుట్టింట్లో ఉన్న సంపద మొత్తం తగ్గిపోతుందట.

బియ్యం: అమ్మాయిలు పుట్టింటి నుంచి బియ్యం తెచ్చుకుంటే పుట్టింట్లో ఉన్న  సిరి సంపదలు తగ్గిపోతాయట. అయితే చాలా మంది వడిబియ్యం తెచ్చుకుంటారు కదా అనుకోవచ్చు. వడి బియ్యం అనేది సంప్రదాయమైన పద్దతి వడిబియ్యం పోయడం వల్ల ఇరు కుటుంబాలకు మంచే జరుగుతుందట.

Advertisement

ముగ్గు పిండి: అమ్మాయిలు తమ పుట్టింటి నుంచి ముగ్గు పిండి తెచ్చుకుంటే అది వారికే నష్టమట. దీని వల్ల అమ్మాయిల ఇంటికే దురదృష్టం వస్తుందట.

చింతపండు: అమ్మాయిలు ఎవరైతే పుట్టింటి నుంచి చింత పండు తెచ్చుకుంటారో దీని వల్ల ఆ రెండు ఇళ్ల మధ్య ( అమ్మాయి పుట్టినిల్లు, మెట్టినిల్లు) తగాదాలు అయ్యే అవకాశం ఉంటుందట.

ఉప్పు: ఎవరైతే పుట్టింటి నుంచి ఉప్పు తెలిసి తెచ్చుకున్నా తెలియక తెచ్చుకున్నా దాని వల్ల పుట్టింట్లో ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయట.

ఆకుకూరలు, కూరగాయలు: అమ్మాయిలు ఎప్పుడైనా తమ పుట్టింటి నుంచి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తెచ్చుకుంటే దీని వల్ల ఆ పుట్టింట్లో సంతోషం అనేది లేకుండా పోతుందట.

చింతకాయ పచ్చడి: ఇలా పుట్టింటి నుంచి ఎవరైనా అమ్మాయిలు చింతకాయపచ్చడి కానీ ఏదైనా ఊరగాయ కానీ తెచ్చుకుంటే పుట్టింట్లో సంపద తగ్గిపోతుందట.

పాలు, పెరుగు: ఎవరైతే అమ్మాయిలు పుట్టినిల్లు నుంచి పాలు, పెరుగు తెచ్చుకుంటారో.. అలాంటి అమ్మాయి ( మెట్టినిల్లు) ఇంట్లో దరిద్రం ఆవహిస్తుందట. వారు ఎప్పటికీ వృద్దిలోకి రారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని పండితులు చెప్తున్నారు.

కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు: ఇలాంటి వస్తువులు ఎవరైనా అమ్మాయిలు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే ఆ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వస్తాయట. ఇంకా చెప్పాలంటే రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగి శత్రుత్వం బలపడుతుందట. పగలు, ప్రతీకారాలతో ఆ రెండు కుటుంబాలు రగిలిపోతుంటాయట.

నూనె: పుట్టింటి నుంచి ఎవరైనా అమ్మాయి నూనె తెచ్చుకుంటే అది అత్తింటికే అరిష్టమట.

ఇంకా చెప్పాలంటే.. పుట్టింటి నుంచి అమ్మాయిలు ఎప్పటికీ అగ్గిపెట్టె, నల్లబట్టలు, దూది, గొడుగు, లక్ష్మీ రూపు, విసుర్రాయి, అద్దం వంటి వస్తువులు అసలు ఎప్పటికీ పట్టుకెల్లకూడదట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: చనిపోయిన వ్యక్తికి మళ్ళీ పునర్జన్మ ఎప్పుడు లభిస్తుంది – అసలు గరుడ పురాణం ఎం చెప్తుందంటే..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×