E-Paper
Advertisement

Gomati Chakra: అన్ని పరిహారాలకు గోమతి చక్రంతో చేసే రెమెడీ అద్భుతంగా పని చేస్తుందట – ఎలా చేయాలో తెలుసా

Gomati Chakra: అన్ని పరిహారాలకు గోమతి చక్రంతో చేసే రెమెడీ అద్భుతంగా పని చేస్తుందట – ఎలా చేయాలో తెలుసా
Advertisement

Gomati Chakra: ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే అన్ని రకాల పరిహారాల కోసం గోమతి చక్రాలు ఉపయోగపడతాయి అంటున్నారు పండితులు. గోమతి చక్రాలతో చేసే రెమెడీస్‌ కూడా చాలా అద్బుతంగా పని చేస్తాయట. అయితే గోమతి చక్రాలతో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు.. ఎలా చేసుకోవచ్చు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గోమతీ చక్రాలు సహజసిద్ధంగా లభించే అరుదైన శిలలు. ఇవి  గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న గోమతీ నదిలో లభిస్తాయి. ఇవి శ్రీమహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పోలి ఉంటాయి. కాబట్టి, వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. వీటిని లక్ష్మీ స్వరూపంగా కూడా భావించి పూజలు చేస్తుంటారు. వాస్తు దోష నివారణకు ఉపయోగిస్తారని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

ఆర్థిక అభివృద్ధికి (సంపద కోసం): ఆర్థికాభివృద్ది కోసం 11 గోమతి చక్రాలను తీసుకుని పసుపు లేదా ఎర్రటి వస్త్రంలో కట్టి, మీ బీరువాలో లేదా ధనం ఉంచే చోట పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీకు  లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయట. అలాగే శుక్రవారం రోజు వీటిని పూజ గదిలో పెట్టి ‘మహాలక్ష్మి అష్టకం’ చదవడం వల్ల ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయట.

వ్యాపార వృద్ధి కొరకు: మీరు చేస్తున్న వ్యాపారం సరిగ్గా నడవడం లేదనిపిస్తే .. ఏడు గోమతి చక్రాలను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఆఫీసు లేదా షాపు ప్రవేశ ద్వారం (గుమ్మం) పైన కట్టాలి. దీనివల్ల కస్టమర్లు ఆకర్షించబడతారట. మీ వ్యాపారం కూడా లాభాల బాట పడుతుందని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

దృష్టి దోషం మరియు నెగిటివ్ ఎనర్జీ నివారణ: ఎవరి ఇంట్లోనైనా తరచుగా గొడవలు జరుగుతుంటే లేదా ఎవరిదైనా మీ ఇంటికి కానీ మీకు కానీ దిష్టి తగిలింది అనిపిస్తే.. వెంటనే మూడు గోమతి చక్రాలు తీసుకుని  ఇంటి చుట్టూ తిప్పి బయట పారవేయాలట. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని నెగెటివ్‌ ఎనర్జీ మొత్తం పోయి సంతోషంగా ఉంటారట. ఇక పిల్లలు ఎక్కువగా భయపడుతుంటే, ఒక గోమతీ చక్రాన్ని లాకెట్‌గా వేయడం వల్ల వారిపై చెడు ప్రభావాలు ఉండవని పండితులు సూచిస్తున్నారు.

ఆరోగ్య సమస్యల కోపం: ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉంటే వాళ్లు  పూజించిన గోమతి చక్రాలను తమ దిండు కింద పెట్టుకుని పడుకుంటే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందట. ఇంకా చెప్పాలంటే తంత్రశాస్త్రం  ప్రకారం గోమతి చక్రాలను నీటిలో నానబెట్టి తర్వాత ఆ నీటిని తీసుకోవడం వల్ల వారి ఆనారోగ్య సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

వాస్తు దోష నివారణ: కొత్త ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో 11 గోమతీ చక్రాలను వేయడం వల్ల ఆ ఇంట్లో ఎప్పటికీ వాస్తు దోషాలు ఉండవట. అలాగే ఆ ఇంట్లో నివశించే కుటుంబం ఎప్పుడు సుఖశాంతులతో ఉంటారట.

ఉపయోగించే ముందు ఎలా  పూజించాలి?: గోమతీ చక్రాలను ఉపయోగించే ముందు వాటిని శుభ్రమైన నీటితో కడిగి, పసుపు, కుంకుమ పెట్టి పూజించాలి. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని పఠిస్తే ఫలితం త్వరగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ధన ధాన్య ఐశ్వర్యాల కోసం ఉగాది రోజు ఆ దానం చేయాలట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×