E-Paper
Advertisement

Ugadi Festival: ధన, ధాన్య ఐశ్వర్యాల కోసం ఉగాది రోజు ఆ దానం చేయాలట

Ugadi Festival: ధన, ధాన్య ఐశ్వర్యాల కోసం ఉగాది రోజు ఆ దానం చేయాలట
Advertisement

Ugadi Pooja: ధన, ధాన్య, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా..? అయితే అందుకోసం ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయారా..? అయితే ఉగాది రోజు ఒక్క దానం చేస్తే చాలట మీరు కోరుకున్న ఐశ్వర్యాలు మీ ముందు వచ్చేస్తాయట. కలలో కూడా ఊహించని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందట. ఇంతకీ ఆ దానం  ఏంటో తెలుసుకోవాలనుందా…? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది.

హిందూ పరిహారశాస్త్రంలో ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం అయితే ఉంటుంది. అలాగే ఎంత కష్టపడినా ఫలితం రాని వాళ్లకు కూడా పరిహారశాస్త్రంలో మంచి రెమెడీస్‌ ఉన్నాయని పండితులు చెప్తున్నారు. సింపుల్ గా ఉగాది రోజు చేసుకునే ఈ రెమెడీస్‌ వల్ల మీ కేరీర్‌ ఊపందుకోవడమే కాకుండా ఆష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అయితే ఉగాది అంటే తెలుగు వారి  కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజున దానం (దాన ధర్మం) చేయడం చాలా శుభప్రదంగా కూడా భావిస్తారట.

Advertisement

ఉగాది రోజు చేయాల్సిన ముఖ్యమైన దానాలు: ఉగాది రోజు కొన్ని ముఖ్యమైన దానాలు చేయడం వల్ల వారికి వారి కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్ముతారు.

అన్నదానం (అత్యంత శ్రేష్ఠం) చేయడం: ఉగాది పండుగ రోజు కచ్చితంగా అన్నదానం చేయాలట. అయితే చాలా మంది తమ బంధువులను చుట్టాలను స్నేహితులను ఇంటికి పిలిచి భోజనం  పెట్టి అదే అన్నదానం చేశామని అనుకుంటారు. అలా కాదు.. బీదలకు, పేదలకు అన్నదానం చేయాలి. ఏదైనా గుడి దగ్గరకు వెళ్లి అన్నదానం చేయాలి. అప్పుడే మీరు అన్నదానం చేసినవారు అవుతారు అని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే మీకు ధన, ధాన్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తున్నారు.

Advertisement

బియ్యం లేదా ధాన్యం దానం చేయాలి: ఉగాది పండుగ రోజు అన్నదానం చేయలేని వారు కచ్చితంగా కనీసం బియ్యం, పప్పులు లేదా గోధుమలు లాంటివి బీద వారికి పేద వారికి దానంగా ఇవ్వాలట. అదీ కుదరకపోతే ఏదైనా ఆలయంలో అన్నదానం చేసే కమిటీలకు ఇవ్వాలని సూచిస్తున్నారు. దీనివల్ల  ఆ ఇంట్లో ధాన్య సమృద్ధి కలుగుతుందట.

బట్టలు లేదా వస్త్రాలు దానం చేయడం: ఉగాది పండుగ రోజు కచ్చితంగా చేయాల్సిన మరో దానం బట్టలు, లేదా వస్త్రాలు దానం చేయడం. పేదవారికి లేదా బ్రాహ్మణులకు కొత్త బట్టలు ఇవ్వాలని సూచిస్తున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీ దేవి కటాక్షం మీ మీద పడుతుందని మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగు పొర్లుతాయంటున్నారు.

బెల్లం మరియు పండ్ల దానం చేయడం: ఉగాది పండుగ రోజు కచ్చితంగా చేయాల్సిన మరో దానం బెల్లం, మామిడి, అరటిపండ్లు వంటి వాటిని తీసుకెళ్లి ఏదైనా ఆలయంలో  పేదవారికి దానంగా ఇవ్వాలని సూచిస్తున్నారు పండితులు. దీని వల్ల మీ జీవితంలో తీపి ఫలితాలు వస్తాయట.

నూనె లేదా దీపం దానం చేయడం: ఉగాది పండుగ రోజు దేవాలయంలో నూనె, నెయ్యి, దీపం ఇవ్వాలట. దీని వల్ల మీ జీవితంలో అలుముకున్న అంధకారం తొలగి శుభ ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు పండితులు.

పంచాంగం లేదా పుస్తకాల దానం: ఉగాది పండుగ రోజు కచ్చితంగా పేద విద్యార్థులకు పుస్తకాలు దానంగా ఇవ్వాలట. అలాగే బ్రహ్మణులకు పంచాంగం దానంగా ఇవ్వాలట. ఇలా చేయడం వల్ల మీలోని  జ్ఞానం పెరుగుతుందట. అలాగే ఉగాది రోజు నీటి పాత్ర (కుండ), బెల్లం, పానకం లేదా నీళ్లు దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా లభిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఉగాది రోజు ఆ పనులు తప్పనిసరిగా చేయాలట – అవేంటో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×