E-Paper
Advertisement

Mars transit: కుజగ్రహ సంచారం – ఆ ఐదు రాశులకు తిరుగుండదట

Mars transit: కుజగ్రహ సంచారం – ఆ ఐదు రాశులకు తిరుగుండదట
Advertisement

Mars transit: కుజగ్రహ సంచారం ఆ ఐదు రాశులకు మహర్ధశ పట్టబోతుందని పండితులు చెప్తున్నారు. ఇన్ని రోజులు వారు ఎదుర్కోన్న కష్టాలన్నీ ఇక తీరనున్నాయని అంటున్నారు. ఈ కుజగ్రహ సంచారం దాదాపు మండలం రోజులు అంటే 40 రోజులు ఉంటుందని ఈ 40 రోజులు ఆ ఐదు రాశులకు శుభ ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఐదు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.

 మేష రాశి: కుంభరాశిలో అంగారక సంచారం వల్ల మీ లాభస్థానాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, బాధ్యతలు పెరగడం, పదోన్నతి మరియు జీతం పెరుగుదల సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఆదాయం పెరిగి, కొత్త ఒప్పందాలు లాభదాయకంగా మారతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం అనుకూలంగా ఉండటం వల్ల మీరు నిర్ణయాలు ధైర్యంగా తీసుకునే స్థితిలో ఉంటారు.

Advertisement

మిథున రాశి: ఈ కుజ గోచారం వల్ల మీ భాగ్యస్థానంపై ప్రభావం చూపి కెరీర్‌లో నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతిని అందిస్తుంది. విదేశీ ఉద్యోగం లేదా విదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన అవకాశాలు బలపడతాయి. పదోన్నతి అవకాశాలు ఉన్నా ఆలస్యం కావచ్చు. కాబట్టి ఓర్పు అవసరం. వ్యాపారంలో లాభాలు పరిమితంగా ఉన్నా భవిష్యత్తుకు బలమైన దారులు తెరుచుకుంటాయి. కుటుంబ ఖర్చులు పెరగవచ్చునని ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది.

సింహా రాశి: కుజ సంచారం మీ ఏడవ ఇంటి ద్వారా కేరీర్‌లో కీలక మార్పులు తీసుకొస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాలు మీకు లాభాలను అందిస్తాయి. ఉన్నతాధికారులు మరియు ప్రభావశీల వ్యక్తుల మద్దతు లభించడం వల్ల మీ పేరు, గుర్తింపు పెరుగుతుంది. విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థలతో పని చేసే అవకాశం కూడా ఏర్పడవచ్చు. దాంపత్య జీవితం సానుకూలంగా మారి సంబంధాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

Advertisement

కన్యా రాశి: ఈ కుజ గోచారం మీ ఆరవ ఇంటిని ప్రభావితం చేసి పోటీ పరిస్థితుల్లో మీకు విజయం సాధించే శక్తిని ఇస్తుంది. ఉద్యోగంలో పని తీరు మెరుగై అధికారుల ప్రశంసలు మరియు మద్దతు లభిస్తాయి. కొత్త బాధ్యతలు మీకు భవిష్యత్తులో పదోన్నతికి దారితీసే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు లాభాలను తెస్తాయి. కుటుంబ జీవితం సంతృప్తిగా ఉండి ఆరోగ్యం కూడా సాధారణంగా నిలుస్తుంది.

ధనస్సు రాశి: కుంభరాశిలో కుజ గ్రహ సంచారం వల్ల మీ ప్రయత్నాలకు బలం చేకూరుతుంది. కేరీర్‌లో విజయాలను అందిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఆదాయం పెరిగి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం ఏర్పడుతుంది. విదేవీ రంగాల నుంచి ఆర్థిక లాభాలు లేదా అవకాశాలు రావచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉన్నా పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించడం మంచిది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ నక్షత్రంలో తిరుమల శ్రీవారిని దర్శిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×